‘ప్రిన్స్’ ఫస్ట్ సింగల్ బింబిలిక్కి పిలాపి విడుదల

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది.ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్‌లను ఫస్ట్ సింగల్ ”బింబిలిక్కి పిలాపి”డ్యాన్స్ నెంబర్ తో గ్రాండ్ గా ప్రారంభించింది చిత్ర యూనిట్. 

సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ లో మాస్ బీట్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేయగా.. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ఈ పాటని చూస్తుంటే థియేటర్లో ఫ్యాన్స్ విజల్స్ వేయడం ఖాయమనిపిస్తోంది.రామ్ మిరియాల, రమ్య బెహరా, సాహితీ చాగంటి త్రయం ఈ పాటని డైనమిక్ గా ఆలపించగా.. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది.

ఈ పాటలో శివకార్తికేయన్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించగా, మారియా కూడా శివకార్తికేయన్ యొక్క ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. మారియా తన సూపర్ కూల్ లుక్స్, స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్‌తో ఆకట్టుకుంది.నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం:- అనుదీప్ కె.వి

సంగీతం:- ఎస్ థమన్

నిర్మాతలు:- సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు

బ్యానర్లు:- శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్

సమర్పణ:- సోనాలి నారంగ్

సంగీతం:- ఎస్ థమన్

డీవోపీ:- మనోజ్ పరమహంస

సహ నిర్మాత:-  అరుణ్ విశ్వ

ఎడిటర్:- ప్రవీణ్ కెఎల్

ఆర్ట్ :- నారాయణ రెడ్డి

పీఆర్వో :- వంశీ-శేఖర్

Telugu 70mm

Recent Posts

Eesha Rebba

2 mins ago

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

29 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

5 hours ago

థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…

5 hours ago

‘Love Me’ Trailer.. A ghost story coming from Dil Raju’s compound

Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…

5 hours ago