ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రవితేజ

ఈమధ్య కాలంలో ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ఒరవడి బాగా జోరందుకుంది. అలాగే.. కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాలకోసం ఓ సినిమాటిక్ యూనివర్స్ నే సృష్టిస్తున్నారు. ఈకోవలోనే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రమే ‘హనుమాన్‘. ఈ సిరీస్ లో తర్వాతి రాబోయే చిత్రం ‘జై హనుమాన్‘.

తన సినిమాటిక్ యూనివర్స్ లో ఇకపై వరుస సినిమాలొస్తాయని ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ లో మాస్ మహారాజ రవితేజ తో కూడా ఒక సినిమా చేస్తాడట. ‘హనుమాన్‘లో ఒక కోతి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పాల్సిందిగా మూడేళ్ల క్రితం నుంచే రవితేజని అడిగాడట ప్రశాంత్. రవితేజ వాయిస్ ‘హనుమాన్‘ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆ అనుబంధంతోనే రవితేజ హీరోగా తన యూనివర్స్ లో ఓ సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్నాడట. మరి.. ఈ యూనివర్స్ లో ఏ క్యారెక్టర్ కి రవితేజ సెట్ అవుతాడో చూడాలి.

Related Posts