‘ఫైటర్‘ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?

ప్రభాస్ కిట్టీలో ఇప్పటికే ‘కల్కి, రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్‘ వంటి చిత్రాలున్నాయి. ఇంకా.. హను రాఘవపూడి వంటి దర్శకులు లైన్లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా ప్రభాస్ విష్ లిస్టులో ఉన్నాడు. చాన్నాళ్ల క్రితమే ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో సినిమాకోసం ప్రయత్నాలు ప్రారంభించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఇద్దరికీ అడ్వాన్సులు కూడా ఇచ్చిందట.

పోయినేడాది రిపబ్లిక్ డే కానుకగా ‘పఠాన్‘ మూవీతో బాలీవుడ్ ని మళ్లీ కోలుకునేలా చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. ఇక.. ఈ రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన ‘ఫైటర్‘తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈరోజు రిలీజైన ‘ఫైటర్‘కి అంతటా సూపర్ రివ్యూస్ వస్తున్నాయి. బాలీవుడ్ కి మరో వెయ్యి కోట్లు అందించే సినిమా అవ్వబోతుందనే అప్లాజ్ వస్తోంది. ఇక.. ‘ఫైటర్‘ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ ఇంతవరకూ తన తర్వాతి సినిమాని ప్రకటించలేదు.

ఈనేపథ్యంలో.. ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబోని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించబోతుందట మైత్రీ మూవీ మేకర్స్. ప్రభాస్ కటౌట్ కి పడిపోని దర్శకులెవరుంటారు.. అందుకు సిద్ధార్థ్ ఆనంద్ కూడా మినహాయింపేమీ కాదు. ప్రభాస్ తో పనిచేయడానికి అతను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి.. ఈ క్రేజీ కాంబో పై ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Related Posts