ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతోంది

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి మళ్లీ ఆ రేంజ్ భారీ సక్సెస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సత్తా మళ్ళీ ‘సలార్’ కే ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నారు. అందుకే ‘సలార్‘పై అంచనాలైతే మామూలుగా లేవు. అందుకు తగ్గట్టే ‘సలార్‘ అవుట్ పుట్ ను అద్భుతంగా తీసుకురావడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కంటిమీద కునుకు లేకుండా కష్టపడుతున్నాడట.

అసలు సెప్టెంబర్ 28నే రావాల్సిన ‘సలార్‘ను పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ 22కి షిప్ట్ చేశారు. ఇప్పటికే ‘సలార్‘ నుంచి విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ‘సలార్‘ ట్రైలర్ కు ప్రభాస్ బర్త్ డే కంటే మంచి సమయం దొరుకుతుందా? అందుకే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‘ ట్రైలర్ ను విడుదల చేయడానికి కసరత్తులు ప్రారంభించిందట టీమ్.

యంగ్ రెబెల్ స్టార్ ఊరమాస్ లుక్ లో కనువిందు చేయబోతున్న ‘సలార్‘లో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ప్రతినాయక పాత్రలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కనిపించనున్నాడు. ఇంకా.. జగపతిబాబు, టిను ఆనంద్, ఈశ్వరిరావు, శ్రీయరెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కె.జి.యఫ్‘ సిరీస్ కి అద్భుతమైన సంగీతాన్నందించిన రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ సమకూర్చిన భువన్ గౌడ ‘సలార్‘కి వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 22న రాబోతున్న ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్‘ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts