మూడు నెలల గ్యాప్ లో మూడు చిత్రాలు

సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. వెండితెరను ఏలిన ఎంతోమంది రాజకీయాల్లోనూ రాణించారు. అలాగే ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఆయా రాజకీయ పార్టీల వ్యక్తుల కథాంశాలతో సినిమాలు రూపొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కథాంశంతో మూడు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు జనంముందుకు వస్తున్నాయి.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించేందుకు ‘వ్యూహం, శపథం‘ చిత్రాలతో సిధ్ధమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ‘వ్యూహం, వ్యూహం 2 (శపథం)‘ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.

వై.ఎస్.జగన్ జీవితకథతో రూపొందుతోన్న ‘వ్యూహం‘ చిత్రాన్ని నవంబర్ 10న, ‘శపథం’ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు వర్మ. ఈ సినిమాలో జగన్ గా తమిళ నటుడు అజ్మల్ అమీర్ కనిపించబోతున్నాడు.

మరోవైపు జగన్ జీవితకథతో రూపొందుతోన్న ‘యాత్ర 2‘ కూడా వచ్చే యేడాది ఫిబ్రవరి 8న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమాలో జగన్ పాత్రను మరో తమిళ నటుడు జీవా పోషిస్తున్నాడు. మొత్తంమీద.. నవంబర్ 10 నుంచి ఫిబ్రవరి 8 వరకూ మూడు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు జగన్ కథాంశంతో థియేటర్లలోకి రాబోతున్నాయన్నమాట.

Related Posts