పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఆతర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవర్ స్టార్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాలో పవర్ స్టార్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడట. వెండి తెర పై గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ అభినవ కృష్ణుడిగా నటించి ఎంతగానో అలరించాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ఇప్పుడు తెలుగులో విలన్గా నటిస్తూ బిజీ అయిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తమిళంలో వినోధాయ సిత్తం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ తమిళ మూవీలో దేవుడి పాత్రను సముద్రఖని చేశాడు. తెలుగులో ఈ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని, తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా కథలో మార్పులు చేస్తున్నారని సమాచారం. సముద్రఖని దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కబోతుందని, ఈ చిత్రాన్ని తివిక్రమ్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగిలిన తారాగణాన్ని ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి.. రెండోసారి కూడా పవర్ స్టార్ దేవుడిగా మెప్పిస్తాడేమో చూద్దాం.
‘కార్తికేయ 2‘తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్నాడు నిఖిల్. ఒకవిధంగా ప్రెజెంట్ దేశవ్యాప్తంగా సాగుతోన్న డివోషనల్ ట్రెండ్…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మెగా హీరోలంతా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారంలో స్పీడు పెంచారు.…
Young hero Sandeep Kishan always tries to entertain the audience with varied films regardless of…
Every director has a style. Not everyone will like it. But.. there are some directors..…
జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తుంటాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ…
Man of masses NTR most awaited movie 'Devara'. The first part of this high voltage…