ప్రభాస్.. ఇండియాస్ టాప్ స్టార్స్ లో ఒకడుగా దూసుకుపోతున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ను ఓ రేంజ్ పెంచుకుని ఇప్పటికే ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఏకంగా మూడు నాలుగు సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా వస్తోన్న చిత్రం రాధేశ్యామ్. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం వచ్చింది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ చిత్రం నుంచి ఓ టీజర్ విడుదల చేశారు.
రాధేశ్యామ్ పై ఒక దశలో అంచనాలు పూర్తిగా లేకుండా పోయాయి. కానీ ట్రైలర్ తర్వాత అంతా ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. తాము ఊహించని ఓ బలమైన కంటెంట్ ఏదో ఈ సినిమాలో ఉందని ఫిక్స్ అయ్యారు. పైగా ప్రభాస్ ను చాలారోజుల తర్వాత లవర్ బాయ్ గాచూపిస్తున్నారు. అలాగే ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదో తెలుగు టైటానిక్ అవుతుందనే బిల్డప్ లు కనిపించాయి. దీంతో అంచనాలు పెరిగాయి. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న రాధేశ్యామ్ టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అలకలు కామన్ కదా.. ఆ అలకల తర్వాత ‘ ఇంక లైఫ్ లో వాడి మొహం చూడను’అనే పూజాహెగ్డే డైలాగ్ తో ప్రారంభం అయిన టీజర్ ప్రతి ఫ్రేమ్ లోనూ ఫ్రెష్ గా కనిపించింది. మామూలుగా ట్రైలర్ తర్వాత వచ్చే టీజర్స్ లో ట్రైలర్స్ షాట్స్ కూడా పడుతుంటాయి. కానీ ఇందులో అవేం లేకుండా పూర్తి కొత్త టీజర్ కట్ చేశారు. ఇది ఇంకా ఆకట్టుకుంది. అయితే టీజర్ చివర్లో పూజాహెగ్డే ప్రభాస్ పెళ్లి గురించి అడిగిన డైలాగ్ అతని పర్సనల్ లైఫ్ కు కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మరింత బావుంది.
‘‘కుక్ చేస్తావ్.. బాగా మాట్లాతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు’’ అని పూజా హెగ్డే అడినప్పుడు ఆ పర్సనల్ లైఫ్ ఇష్యూ కూడా ఎలివేట్ అయ్యేలా ప్రభాస్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. మరి వచ్చే నెలలో విడుదల కాబోతోన్న రాధేశ్యామ్ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.