వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ గా ‘మట్కా‘ గ్లింప్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస‘ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మట్కా‘. ‘హాయ్ నాన్న‘తో హిట్ అందుకున్న వైరా ఎంటర్ టైన్ మెంట్స్.. ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ‘మట్కా ఓపెనింగ్ బ్రాకెట్‘ పేరుతో ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లింప్స్ లో వరుణ్ తేజ్ డిఫరెంట్ మేకోవర్ తో ఆకట్టుకుంటున్నాడు.

1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ స్టోరీగా ‘మట్కా’ రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకోసం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకంగా సెట్ ను నిర్మించారు. వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts