పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైన నేను మీకు బాగా కావాల్సినవాడిని ట్రైలర్

*కమర్షియల్ హంగులతో “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ట్రైలర్*

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం,సమ్మతమే చిత్రాలతో అలరించిన కిరణ్‌ హీరోగా ఇప్పుడు “నేను మీకు బాగా కావాల్సినవాడిని” చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు ఎస్‌ఆర్‌ కల్యాణమండపం డైరెక్టర్‌ శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ టీం.రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని కమర్షియల్ హంగులు సమపాళ్లలో ఉన్నట్లు అర్ధమవుతుంది. కిరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. కిరణ్ ఈ సినిమాలో  క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.వి కృష్ణారెడ్డి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తో పాటు కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా కనిపించనున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది.

ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా, ఈ నెల 16న విడుదల కానుంది.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago