విజయ్ కి విలన్ గా మన వరదరాజులు

నిన్నటి హీరోలే నేటి విలన్స్ అన్న ట్రెండ్ నడుస్తోందిప్పుడు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగినా.. తర్వాత మార్కెట్ పోయిన హీరోలంతా విలన్స్ గా మారుతున్నారు. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టులవుతున్నారు. ఒకప్పుడు పాత హీరోలు విలన్స్ చేస్తే వారి గత ఇమేజ్ అడ్డంగా ఉండేది. కానీ ఇప్పుడు అవేం లేవు. క్యారెక్టర్ ను బట్టే ఆర్టిస్టును డిసైడ్ అయిపోతున్నారు ఆడియన్స్. అందుకే నాటి హీరోలు నేడు విలన్స్ చేయడానికి కూడా వెనుకాడ్డం లేదు. ఆ కోవలోనే ఒకప్పుడు ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న జగపతిబాబు ఇప్పుడు క్రూరమైన విలన్గా మెప్పిస్తున్నాడు. అతన్లాంటి ఇమేజే ఉన్న శ్రీకాంత్ కూడా ఆ రూట్లోనే ఎంటర్ అయ్యాడు.
నిజానికి శ్రీకాంత్ ఇండస్ట్రీకి ఫస్ట్ మూవీలో నలుగురులో ఓ హీరోగా పరిచయమైనా తర్వాత గుర్తింపు తెచ్చుకుంది విలన్ పాత్రలతోనే. ఆ తర్వాతే మళ్లీ హీరోగా మారాడు. అందుకే తన పాత నటనలోకే కొత్తగా వెళుతున్నాడు. ఆ మధ్య ఓ నాలుగైదు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కనిపించాడు కానీ.. అవేవీ అతని కొత్త కెరీర్ కు పెద్దగా హెల్ప్ కాలేదు. అటుపై విలన్ గానూ చేశాడు. కానీ సినిమాలు పోవడంతో గుర్తింపు రాలేదు. చివరగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేసిన అఖండతో అదరగొట్టేశాడు. వరదరాజులు పాత్రలో ఓ రేంజ్ విలనీ పండించాడు. దీంతో శ్రీకాంత్ కు కూడా ఇతర భాషల నుంచి విలన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు.
ఇళయదలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందుతోన్న బైలింగ్వుల్ ప్రాజెక్ట్ లోకి శ్రీకాంత్ ను అఫీషియల్ గా తీసుకున్నారు. ఈ విషయం ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. అయితే తను విలన్ గా చేస్తున్నాడా లేక ఇంకేదైనా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడా అనేది ఇంకా చెప్పలేదు కానీ.. ప్రస్తుతం విలన్ గానే ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి.. ఆ రోల్ చేస్తున్నట్టే భావించాలి. మరో విశేషం ఏంటంటే ఇది బై లింగ్వుల్ కాబట్టి.. ఒకే సినిమాతో రెండు భాషల ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం దక్కించుకున్నాడు శ్రీకాంత్. మరి విజయ్ తో శ్రీకాంత్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago