పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి రావాలి అనుకున్న ఈ భారీ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. భీమ్లానాయక్ సినిమాతో పాటు పవర్ స్టార్ హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ భారీ పిరియాడిక్ మూవీ దాదాపుగా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. జనవరి నుంచి తిరిగి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ బాలయ్య డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే.. అఖండ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పవర్ స్టార్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. త్వరలోనే పవర్ స్టార్ కు కథ కూడా వినిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరియు ఆయన పొలిటికల్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని బోయపాటి ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీని సిద్ధం చేశారట. రియల్ లైఫ్ లో జనసేన పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్.. బోయపాటి స్టోరీలో కూడా ఒక రాజకీయ పార్టీ లీడర్ గా కనిపిస్తారట. ఊహించని ఈ కాంబినేషన్ సెట్ అయితే.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…