నాని-సుజీత్ కాంబోపై అధికారిక ప్రకటన

నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రంగా ‘హాయ్ నాన్న‘ చేశాడు. ప్రస్తుతం 31గా ‘సరిపోదా శనివారం’ వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే లేటెస్ట్ గా తన 32వ చిత్రాన్ని ప్రకటించాడు. ‘సరిపోదా శనివారం’ సినిమాని నిర్మిస్తోన్న డివివి ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలోనే నాని 32 కూడా ఉండబోతుంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

నాని బర్త్ డే స్పెషల్ గా ఈ క్రేజీ కాంబో మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అంతేకాదు.. ‘వాట్ ఇఫ్ వైలెంట్ మ్యాన్ టర్న్స్ నాన్-వైలెంట్?’ అంటూ ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోని కూడా విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే ఓ కొత్త జోనర్ లో నానిని సుజీత్ ప్రెజెంట్ చేయబోతున్నట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ చివరిదశకు చేరుకుంది. ఆగస్టులో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ని కాసేపు పక్కనపెట్టి నాని 32ని త్వరలోనే పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నాడట సుజీత్. ‘ఓజీ’ నిర్మించేది సేమ్ బ్యానర్ కాబట్టి నాని చిత్రం షూటింగ్ కి ఏమాత్రం ఇబ్బంది ఉండే అవకాశం లేదు.

Related Posts