‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీజర్.. హాస్య నటుల హారర్ హంగామా

సీనియర్ రైటర్ కోన వెంకట్ రాసిన హారర్ కామెడీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ చిత్రానికి కథకుడుగా మాత్రమే కాదు నిర్మాత కూడా ఆయనే. ఎం.వి.వి.సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘లో అంజలి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా అంజలికి 50వ చిత్రం కావడం విశేషం.

హారర్ మూవీస్ అనగానే పూర్తిస్థాయిలో ప్రేక్షకుల్ని భయపెట్టేవిగా ఉంటాయి. అయితే.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘ ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ కమ్ హారర్ మూవీ. అందుకే.. ఈ చిత్రానికి ‘ది మదర్ ఆఫ్ ఆల్ హారర్ కామెడీస్‘ అంటూ ఓ ట్యాగ్ ఇచ్చేసింది టీమ్. ఈ మూవీలో కమెయడిన్స్ కి కొదవలేదు. శ్రీనివాసరెడ్డి ఎలాగో హీరో. ఇక.. మిగతా పాత్రల్లో సునీల్, ఆలీ, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య కామెడీని పండించబోతున్నారు.

లేటెస్ట్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీజర్ రిలీజయ్యింది. టీజర్ విషయానికొస్తే.. సీక్వెల్ లో కామెడీతో పాటు హారర్ డోస్ కూడా పెంచినట్టు కనిపిస్తుంది. ఓ సంగీత్ మహల్.. అక్కడ షూటింగ్ చేయడానికి వెళ్లిన బృందం.. వారికి ఎదురైన అనుభూతులు నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి తెరకెక్కించాడు. మార్చి 22న పలు భాషల్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది‘ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts