ఎన్టీఆర్ ఆగుతున్నది ఆచార్య కోసమేనా..?

ఆర్ఆర్ఆర్ లో అద్భుత నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాతో వచ్చిన మైలేజ్ ను కంటిన్యూ చేయడానికి నెక్ట్స్ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో మొదట త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ అయినా ఆగిపోయింది. తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటందనుకున్నారు. బట్.. ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది. దీంతో సడెన్ గా సీన్ లోకి కొరటాల శివ వచ్చాడు. ఆల్రెడీ వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. కానీ కంటెంట్ పరంగా అంత గొప్ప మార్కులు తెచ్చుకోలేకపోయింది. ఈ చిత్రం కూడా ఎన్టీఆర్, మోహన్ లాల్ ల పెయిర్ తో పాటు వారి నటన వల్లే నిలబడింది తప్ప గ్రేట్ స్టోరీ అయితే కాదు. అయినా కమర్షియల్ గా విజయం సాధించింది కాబట్టే మరోసారి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. కానీ కొన్నాళ్లుగా కొరటాలతో సినిమా విషయంలో చాలా కమెంట్స్ వస్తున్నాయి. దీంతో పునరాలోచనలో పడిపోయాడు ఎన్టీఆర్. దీనికి మంచి వేదికగా ఆచార్యను ఎంచుకున్నాడట.

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆచార్య ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఇప్పటికైతే సినిమాపై పెద్దగా అంచనాలు పెరగలేదు. అయినా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ కంటెంట్ పరంగా ఈ చిత్రంపై ఇప్పటి వరకూ బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఆచార్య విజయాన్ని బట్టి కొరటాల తో సినిమా చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. ఈ కారణంగానే అటు అలియాభట్ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇటు ఎన్టీఆర్ కూడా టైమ్ తీసుకోవాలనే ఆంజనేయ మాల వేసుకున్నాడు. సో.. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో సినిమాను సెట్ చేసేది పూర్తిగా ఆచార్యే అని చెప్పలేం కానీ అదో ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది.
మరో విషయం ఏంటంటే.. కొరటాల కాకపోతే మరిఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇతను స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ రాసుకుని ఎన్టీఆర్ తోనే చేస్తాను అని పట్టుబట్టుక్కూర్చున్నాడు. కొరటాలన కాదని బుచ్చిబాబుతో వెళ్లినా ఇతని గురించి నార్త్ లో అస్సలు తెలియదు కాబట్టి.. అప్పుడూ ఎన్టీఆర్ కు ఇబ్బంది తప్పదు. సో.. ముందు ఆచార్య రావాలి. ఆ తర్వాతే ఈ వ్యవహారం తేలుతుంది.

Related Posts