పోస్ట్ పోన్ చేసి ప్రాబ్లమ్స్ పెంచుకున్న ‘‘మేజర్’’

తెలుగులో ఇప్పుడు చాలామంది హీరోలు మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. కేవలం నటనలోనే కాదు.. రైటింగ్ లోనూ సత్తా చాటుతున్నాడు. డైలాగ్స్ నుంచి స్క్రీన్ ప్లే వరకూ వాళ్లే చూసుకుంటున్నారు. అలాంటి వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు గూఢచారి అడవి శేష్. అతని లేటెస్ట్ మూవీ మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథగా వస్తోన్న ఈ చిత్రం మే 27న రిలీజ్ అన్నారు. కానీ లేటెస్ట్ గా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ కొత్త డేట్ లో మేజర్ కు గట్టి పోటీ ఉంది.. మరి ఆ పోటీలోనూ మేజర్ నెగ్గుతాడా..?
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతోన్న హీరో అడవి శేష్. తన దర్శకులతో పాటు తనూ కథల్లో ఇన్వాల్వ్ అవుతాడు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏ కథ చెప్పినా ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవడం లేదు. పైగా ఎక్కువ శాతం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న చిత్రాలే కావడంతో.. ఇప్పుడు వస్తోన్న మేజర్ పై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామి అయిన ఈ చిత్రం 26/11 అటాక్స్ నేపథ్యంలో అత్యంత సాహసోపేతంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడి మరణించిన ఉన్ని ముకుందన్ కథ కావడంతో బాలీవుడ్ లోనూ ఈ మూవీపై అంచనాలున్నాయి.

మేజర్ ను మే 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. ఆ రోజు తెలుగులో పెద్దగా పోటీ కూడా లేదు. కేవలం ఎఫ్3 మాత్రమే ఉంది. అయినా ఆ రోజు నుంచి జూన్ 3కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. పోస్ట్ పోన్ కావడం విశేషం కాదు కానీ.. పోటీ లేని డేట్ నుంచి పోటీ ఉన్న డేట్ కు మారడమే ఆశ్చర్యం. ఎందుకంటే జూన్ 3న బాలీవుడ్ నుంచి రెండు భారీ సినిమాలతో పాటు సౌత్ నుంచి కూడా ఓ మోస్ట్ అవెయిటెడ్ మూవీ వస్తోంది. సౌత్ నుంచి వస్తోన్న చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్.
కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తోన్న విక్రమ్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి కూడా జూన్ 3న రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. అజయ్ దేవ్ గణ్ నటించిన మైదాన్ అదే రోజు విడుదలవుతోంది. ఇండియాలో ఫుట్ బాల్ కు గోల్డెన్ ఎరాగా చెప్పుకున్న 1952 -1962 మధ్య కాలంలో సాగిన కథగా వస్తోన్న చిత్రం ఇది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే లాటరీ లాంటిది కాబట్టి.. ఈ చిత్రం మరీ పెద్ద పోటీ ఇస్తుందని చెప్పలేం.
మైదాన్ తో పాటు జూన్ 3నే వస్తోన్న మరో భారీ చిత్రం పృథ్వీరాజ్. మహ్మద్ ఘోరీని ఎదు�