కమల్ హాసన్ విక్రమ్ కు మూడు భాగాలున్నాయా..?

లోక నాయకుడు కమల్ హాసన్ నుంచి ఓ సినిమా వస్తోందంటే దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎప్పుడో ప్యాన్ ఇండియన్ స్టార్ అనిపించుకున్న కమల్ కు ఈ టైప్ మార్కెట్స్ కొత్త కాదు. అందుకే ఇప్పుడు వస్తోన్న విక్రమ్ సినిమాను కూడా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు. లేటెస్ట్ గా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేసింది టీమ్. ఇప్పటి వరకూ కమల్ హాసన్ కు తెలుగులో బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పేవాడు. బాలు లేకపోవడంతో ఈసారి కమల్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఈ కారణంగానే తెలుగు ట్రైలర్ లేట్ అయిందన్నారు. అయితే భాషతో పనిలేకుండా ఆల్రెడీ ఈ ట్రైలర్ అందరినీ మెప్పించింది. జూన్ 3న విడుదల కాబోతోన్న విక్రమ్ తో కమల్ చాలాకాలం తర్వాత భారీ హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. విజయం సంగతి ఎలా ఉన్నా..

ఈ చిత్రానికి మూడు భాగాలుంటాయి అని కమల్ చెప్పిన మాటలు మాత్రం ఆశ్చర్యంగా ఉన్నాయి.
ఖైదీ, మాస్టర్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ పై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అక్కడి ఫిల్మ్ కంపానియన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కమల్. అందులో భాగంగానే ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే హింట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి చాలామంది రూమర్ అనుకున్నది ఏంటంటే.. సూర్య కూడా నటించాడు అని. బట్ నిజంగానే సూర్య కూడా విక్రమ్ లో ఉన్నాడు.

అతని పాత్ర క్లైమాక్స్ లో వస్తుందట. ఆ పాత్ర చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని.. ఎంత ఇంపాక్ట్ అంటే మూడో భాగంలో అదే కీలకం అనేలా ఉంటుంది అని వ్యాఖ్యలు చేశాడు కమల్. ఇప్పుడు వస్తోంది ఫస్ట్ పార్ట్.మరి సెకండ్ పార్ట్ గురించి ఏ సమాచారం లేకుండానే ఏకంగా మూడో భాగానికి లీడ్ గా సూర్య పాత్ర ఉంటుందని చెప్పడం సంచలనంగా మారింది. దీన్ని బట్టి చూస్తే వీళ్లు ఆల్రెడీ సెకండ్ పార్ట్ ను కూడా చాలా వరకూ షూటింగ్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ మధ్య సినిమాలు సీరీస్ లుగా మారుతున్నాయి. బాహుబలి, కెజీఎఫ్, పుష్ప తర్వాత ఇప్పుడు విక్రమ్.. మరి రెండు, మూడు భాగాల సంగతేమో కానీ.. ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Related Posts