ఎన్టీఆర్-కొరటాల అప్డేట్ చెప్పారు..అయినా ఆలస్యమే..

కొన్నాళ్ల క్రితం వరకూ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు కనిపించాయి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే అవేం లేవు. అంటే అర్థమైంది కదా.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. మరీ ఎక్కువగా లాగితే తెగిపోతుంది. ఆ టైమ్ లో కనిపించిన ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకపోవడానికి కారణం.. ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ సరైన అప్డేట్ లేకపోవడమే. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా వేళ్లు అరిగేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. బట్ మూవీ టీమ్ పట్టించుకోలేదు. అందుకే అంతా సైలెంట్ అయ్యారు. మరీ ఇంత సైలెంట్ అయితే బావోదు అనుకున్నారేమో లేటెస్ట్ గా ఓ స్ట్రాంగ్ అప్డేట్ చెప్పేశారు.


ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారాడు ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం అలాగే ఆస్కార్ నామినేషన్స్ కోసం వేసిన ప్రీమియర్స్ తర్వాత ప్రేక్షకులతో బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. బట్ బ్యాడ్ లక్.. ఆస్కార్ అందని ద్రాక్ష అయిపోయింది. అయితే ఈ గొడవలో పడిపోయి ఆల్రెడీ కమిట్ అయిన కొరటాల శివ సినిమా గురించే పట్టించుకోవడం మానేశారు ఫ్యాన్స్. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత శివతో సినిమా చేయడం చాలామంది అభిమానులకు నచ్చలేదు. అయినా ఎన్టీఆర్ ఆయనకే ఓటు వేశాడు.

ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఖచ్చితంగా చూస్తే అదేమంత బలమైన కథ కాదు. అయినా కొరటాలకే ఎందుకు ఎస్ చెప్పాడో కానీ.. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అతను ఏ మాత్రం ఉపయోగించుకుంటున్నట్టు లేదు అనే భావన కలిగేలా చాలాచాలా ఆలస్యం చేశాడు. ఇప్పటి వరకూ ఈ కథ పూర్తయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు.

మరోవైపు అప్డేట్స్ కూడా ఏం చెప్పడం లేదు. ఆ మధ్య జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అన్నారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ కు నిర్మాతలకు షాక్ తగిలిందట. దీంతో అభిమానులు కూడా ఈ మూవీ గురించి ఆరాలు తీయడం ఆపేశారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి మార్చి నుంచి ఈ మూవీ స్టార్ట్ కాబోతోంది. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.

ఆ వేడుకకు ఎన్టీఆర్ కూడా వెళతాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొదలుపెడదాం అనుకుంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఓ భారీ సెట్‌ వేస్తున్నారు. ఈ సెట్ లోనే ఓ లాంగ్ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందట. అది కాగానే గోవాలో మరో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ షెడ్యూల్ ను ఈ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తారు అని కూడా అంటున్నారు. బట్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఇంక ఆపొద్దు అనుకుంటున్నారట. అందుకే ముందు ఆస్కార్ పని ఐపోతే తీరిగ్గా మొదలుపెట్టొచ్చు అనుకుంటున్నారు. సో.. ఇక ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రం ఈ యేడాది రావడం దాదాపు అసాధ్యం అనే అనిపిస్తోంది కదూ..?

Telugu 70mm

Recent Posts

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

8 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

8 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

8 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

9 hours ago

‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌సంగీతం:…

10 hours ago

Mahesh-Rajamouli film’s Muhurtham fix?

The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…

12 hours ago