ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. ఆ డాక్యుమెంటరీ కూడా ఆస్కార్ గెలుచుకుంది.

మామూలుగా మన సినిమాలను మాస్, క్లాస్ కేటగిరీలో చూస్తుంటాం. ఎవరేమనుకున్నా.. మాస్ మూవీకి వచ్చినంత గుర్తింపు, క్రేజ్ క్లాస్ మూవీకి రాదు. బట్.. అవార్డుల వరకూ వస్తే క్లాస్ మూవీకి మాస్ సినిమా ఏ మాత్రం పోటీ ఇవ్వలేదు. బట్.. ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టుగా ఈ సారి మాస్ అండ్ క్లాస్ మన సినిమా రేంజ్ ను ఆస్కార్ వరకూ తీసుకువెళ్లడమే కాదు.. అవార్డులూ గెలుచుకున్నాయి.

ఇప్పుడు దేశం మొత్తం నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సంబురంలో ఉంది. కానీ ఇదే 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశం నుంచి నామినేట్‌ అయిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’చిత్రం ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ మేరకు దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్న.. అవార్డులను అందుకున్నారు. తమ శ్రమను గుర్తించి, ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన అకాడమీ బృందానికి ధన్యవాదాలు చెప్పారు.


రఘు అనే ఏనుగును ఆదరించిన బొమ్మన్‌, బెల్లి జంటకు.. ఆ ఏనుగుకు మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. వారి మధ్య ఉన్న సహజ సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని ఇందులో చూపించారు. ప్రకృతికి అనుగుణంగా ఉన్న గిరిజన ప్రజల జీవితాన్ని గురించి కూడా ఇందులో చూపించారు. మనిషికీ, ప్రకృతికి మధ్య సంబంధాన్ని, ఉండాల్సిన అనుబంధాన్ని గురించి ఈ డాక్యూ ఫిల్మ్ లో అత్యంత సహజంగా, హృద్యంగా చూపించారు దర్శకురాలు కార్తీకి గోన్ సాల్వెస్. తనకూ చిన్నప్పటి నుంచి అడవి జంతువులంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే బొమ్మన్, బెల్లి అనే జంట రఘు అనే ఏనుగును పెంచుకుంటున్నారనీ.. వీరి మధ్య చాలా సహజమైన బంధం ఉందని తెలుసుకుని..

వారే ప్రధాన పాత్రల్లో చాలా శ్రమలకు ఓర్చి ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. నిజానికి ఈ డాక్యుంటెంటరీ చిత్రానికి మనదేశంలో రావాల్సినం గుర్తింపూ, ప్రచారం లేకపోయినా.. ఎన్నో అంతర్జాతీయ అవార్డుల్లో ఇప్పటికే సత్తా చాటింది. కానీ అన్ని అవార్డులకూ టాప్ అనిపించుకున్న ఆస్కార్ ను సాధించడం ఓ గొప్ప కల నెరవేరినట్టే. ఆ కలను నెరవేర్చుకున్న దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్‌, నిర్మాత గునీత్‌ మోగ్నలకూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం..

Related Posts