నాగ చైతన్య ఎవరికీ దొరకడం లేదా..?

వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా డల్ అయ్యాడు నాగ చైతన్య. వీటికి ముందు కంటిన్యూస్ గా నాలుగు కమర్షియల్ హిట్స్ చూశాడు. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న థ్యాంక్యూ బాలీవుడ్ లో బెస్ట్ డెబ్యూ అవుతుందనుకున్న లాల్ సింగ్ చడ్డా పోవడంతో రీ థాట్ లో పడ్డాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో మూవీ ఉంటుందన్నారు. బట్ లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ ను ఆపేశాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు.


విజయాలకు పొంగిపోవద్దు.. అపజయాలకు కుంగిపోవద్దు అని ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉంటారు. మరి రాత్రికి రాత్రే ఫేట్ మారిపోయే పరిశ్రమలో వీటి విషయంలో ఎంత స్టడీగా ఉంటే అంత మంచిది. అలాగని అసలు పట్టించుకోపోయినా ప్రాబ్లమ్ తప్పదు. అందుకే సినిమా పరిశ్రమను మాయా ప్రపంచం అంటారు కొందరు. ఆ ప్రపంచంలోనే చిన్నప్పటి నుంచీ ఉన్న నాగ చైతన్య ఒక్క ఫ్లాప్ కే షాక్ తిన్నాడు. అందుకు కారణం ఈ చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్.

చైతూ ఫ్యామిలీతో అతను మనం అనే క్లాసిక్ మూవీ తీశాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి విక్రమ్ కు. అయినా చైతన్య ధైర్యం చేసి ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు విక్రమ్. దీనివల్ల చైతూకు ఫ్లాప్ తప్పలేదు. అయితే ఈ ఒక్క ఫ్లాప్ కే అతను మరీ అతి జాగ్రత్తగా మారిపోయాడు. ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చైతన్య అగ్రెసివ్ రోల్ చేస్తున్నాడని చెబుతున్నారు. అతనికి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది.

ఇక ఈ మూవీ తర్వాత గతంలోనే ఓకే అయిన పరశురామ్ తో సినిమా చేయాలనుకున్నాడు. పరశురామ్ గతంలో చైతన్యకు హ్యాండ్ ఇచ్చి మహేష్‌ బాబుతో సర్కారువారి పాట చేశాడు. మూవీ ఓపెనింగ్ టైమ్ లో వదిలేయడంతో చైతన్య హర్ట్ అయ్యాడనే టాక్ అప్పుడే వచ్చింది. అయినా పరశురామ్ ఒప్పించాడు అంటారు. బట్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోని చైతన్య మళ్లీ అతనితో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

ఈ దర్శకుడు నాగేశ్వరరావు అనే టైటిల్ తో కథ చెప్పాడు. కానీ ఈ కథ చైతన్యను పెద్దగా ఎగ్జైట్ చేయలేదట. కేవలం తాతగారి పేరు టైటిల్ గా ఉంది అనడం తప్ప కథ బలంగా లేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా వదిలేశాడు అనే టాక్ ఉంది. దీంతో దర్శకుడు మళ్లీ తన గీత గోవిందం హీరో వైపు చూస్తున్నాడు. మరోవైపు చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరికీ అర్థం కావడం లేదు. చాలా నిర్మాణ సంస్థలు, దర్శకులు కథలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. కనీసం వినే టైమ్ కూడా ఇవ్వడం లేదట. అంటే కస్టడీ మూవీ రిలీజ్ అయ్యేంత వరకూ ఆగుతాడా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది చెప్పలేం.. కానీ ఈ కస్టడీ మూవీ వేసవి బరిలో మే 12న విడుదల కాబోతోంది.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

10 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

11 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

12 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

12 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

12 hours ago