నేచురల్ స్టార్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు

నేచురల్ స్టార్ నాని.. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఇమేజ్ ను పెంచుకున్న హీరో. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ స్టార్ గా ఎదిగాడు. చూడగానే పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడిప్పుడు. మాస్ మూవీస్ తోనూ మెప్పిస్తున్నాడు. ముఖ్యంగా తను ఇప్పటి వరకూ చేయని పాత్రల్లో కనిపించేందుకు ఎక్కువ ట్రై చేస్తున్నాడు. ఆ ఎక్స్ పర్మెంట్స్ కమర్షియల్ గా కూడా వర్కవుట్ అవుతుండటంతో మరింత ఉత్సాహంగా కొత్త కథలకు ఓటేస్తున్నాడు. అలా వస్తోన్న సినిమా దసరా. ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది టీమ్.


నాని నుంచి ఓ సినిమా వస్తోందంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసేలా ఉంటుందనే నమ్మకం ఎప్పుడో వచ్చేసింది. అందుకే అతన్ని నేచురల్ స్టార్ అన్నారు. ఆ ట్యాగ్ కు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మొన్నటి వరకూ ఆ తరహా కథలతోనే ఎక్కువగా వచ్చాడు. బట్ ఓ దశలో ఆడియన్స్ కు మొనాటనీ అనిపించింది. అందకూ స్క్రిప్ట్ మార్చాడు.ఆ క్రమంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ నానికి మంచి పేరు తెచ్చింది. రెండు భిన్నమైన పాత్రల్లో భళా అనిపించాడు. ఆ తర్వాత వచ్చిన అంటే సుందరానికి కూడా తన ఇమేజ్ కు దాటి చేసిన ప్రయత్నమే. ఈ చిత్రానికి మంచి ప్రశంసలు అందుకున్నాడీ నేచురల్ స్టార్.


ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే ఓ కొత్త దర్శకుడుని నమ్మి దసరా అనే సినిమాతో రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో ఇంతకు ముందు నేను లోకల్ అనే హిట్ మూవీ వచ్చింది. దసరా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా. అందుకు తగ్గట్టుగా నాని ఇప్పటి వరకూ కనిపించనంత మాస్ లుక్ లో ఉన్నాడీ సినిమా కోసం. ఆ మధ్య విడుదల చేసిన ఈ మూవీ వీడియోస్ అన్నీ రగ్గ్ డ్ గా అనిపించాయి. అంటే ఓ ‘రా’ సినిమాతో వస్తున్నాడన్నమాట.

నాని, కీర్తిసురేష్‌ తో పాటు ఈ చిత్రంలో సముద్రఖని, షామ్నా ఖాసిమ్, ప్రకాష్‌ రాజ్, రాజేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే యేడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఆ టైమ్ కు ఉన్న హాలిడేస్ ప్రకారం ఇది సినిమాకు లాంగ్ వీకెండ్ అవుతుంది. అందుకే మార్చి 30ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఈ మాస్ మూవీ నేచురల్ స్టార్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Related Posts