మళ్లీ పవర్ ఫుల్ స్టోరీతో వస్తోన్న నరేష్‌

కామెడీ హీరో ఇమేజ్ ను వదిలించుకునేందుకు నరేష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఆ మధ్య అతను నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కొన్ని సినిమాలైతే మినిమం కూడా రాబట్టలేదు. ఆ రేంజ్ లో ఫ్లాప్ అయ్యాయి. దీంతో రూట్ మార్చాడు. కామెడీ సినిమాలను దాటి తన టాలెంట్ ను చూపించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలోనే వచ్చిన నాంది కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ విజయం దక్కించుకుంది. దీంతో ఇక ఆ రూట్ లోనే వెళ్లాలనుకుంటున్నాడేమో.. ఈ సారి కూడా ఓ సీరియస్ కంటెంట్ తోనే వస్తున్నాడు.ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే టైటిల్ తో వస్తోంది నరేష్‌ కొత్త సినిమా. ఈ సినిమాతోనూ ఓ కొత్త దర్శకుడు ఏఆర్ రాజా పరిచయం అవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ సినిమాలో నరేష్ ఎన్నికల అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ మొత్తం సీరియస్ గానే కనిపించింది.

నాంది తరహాలోనే మరోసారి పోలీస్ ల చేతిలో చావు దెబ్బలు తింటాడు నరేష్ అనేది చూపించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని గిరిజన గూడేలకు వెళ్లి అక్కడి జనాల్లో ఓటు పట్ల అవగాహన కల్పించాలని నరేష్‌ టీమ్ వెళుతుంది. కానీ అక్కడి వారి పరిస్థితులు దారుణంగా ఉంటాయి. వాటిని మార్చే క్రమంలో ప్రభుత్వాలనే ప్రశ్నించాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ప్రశ్నకు వచ్చేది సమాధానం కాదు.. దౌర్జన్యమే కదా.. అదే జరుగుతుందని చూపించారు. మరోవైపు తను సాయం చేయాలనుకున్న గిరిజనం కూడా నరేష్ ను అపార్థం చేసుకుంటుంది. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని నరేష్ అండ్ టీమ్ ఎలా పరిష్కరించింది అనేది సినిమా.టీజర్ మొత్తం సీరియస్ గానే ఉంది. నాందిలో చట్టంలోని ఓ సెక్షన్ గురించి హైలెట్ చేసినట్టుగానే.. ఈ సారి కూడా అలాంటి బలమైన పాయింట్ నే చర్చించబోతున్నారని అర్థం అవుతుంది. నరేష్‌ తో పాటు ఫీమేల్ లీడ్ లో ఆనంది కనిపించినా.. తనది రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. నరేష్ కు జంటా కాదనిపిస్తోంది. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, అలీ, సంపత్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మరి ఈ సీరియస్ కథతో కూడా నరేష్ మరో విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Related Posts