పక్కా కమర్షియల్ తో పాటు క్లియరెన్స్ సేల్ కూడా..?

మేచో స్టార్ గోపీచంద్ సీటీమార్ ఇచ్చిన హిట్ జోష్ తో ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ వస్తున్నాడు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీని గీతా ఆర్ట్స్2 బ్యానర్ నిర్మించింది. రాశిఖన్నా హీరోయిన్. సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించాడు. కోర్ట్ రూమ్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నిన్నటి వరకూ సింగిల్ గా వస్తుంది అనుకున్న ఈ పక్కా కమర్షియల్ తో పాటు జూలై 1నే మరో అరడజను సినిమాలు కూడా విడుదల కాబోతుండటం విశేషం. బట్ ఇవన్నీ చిన్న సినిమాలు. ఏ మాత్రం జనాల్లో ఆసక్తిని పెంచలేకపోయిన చిత్రాలు. వీటికి ప్రమోషన్ ఉందా అనే డౌట్ పక్కన బెడితే అసలు ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలున్నాయనేది తీసిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో అన్నట్టుగా ఉన్నాయీ మూవీస్. అయినా ఉన్నంతలో కొంత వరకూఅటెన్షన్ క్రియేట్ చేసిన సినిమా టెన్త్ క్లాస్ డైరీస్. అప్పుడెప్పుడో రోజాపూలు, ఒకరికి ఒకరు చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీరామ్ హీరోగా అవికా గోర్, భానుశ్రీ, వెన్నెల కిశోర్, శివబాలాజీ, శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.

ట్రైలర్ కాస్త బానే ఉన్నట్టు కనిపించింది. గరుడ వేగ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన అంజి ఈ చిత్రంతో దర్శకుడవుతున్నాడు.దీంతో పాటు వస్తోన్న మరో సినిమా షికారు. రజినీకాంత్ కబాలి చిత్రంలో ఆయన కూతురుగా నటించిన సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్, అభినవ్, నవకాంత్, ధీరజ్ ఇతర పాత్రల్లో నటించిన సినిమా ఇది. ట్రైలర్ చూస్తే బిగ్రేడ్ లాంటి సినిమాగా కనిపిస్తోంది. అదేమైనా ఈ మూవీకి ప్లస్ అవుతుందేమో చూడాలి. ఇక తీసిన వారికి తప్ప మిగతావారికి తెలియవేమో అనిపించేలా ఏమైపోతావే, బాల్రాజు, ఈవిల్ లైఫ్‌ అనే చిత్రాలూ వస్తున్నాయి. ఈ మూవీస్ ట్రైలర్స్ చూస్తోంటేనే తెలుస్తోంది. ఏ మాత్రం క్వాలిటీ లేని సినిమాలు అని.ఈ తెలుగు చిత్రాలతో పాటు ఏనుగు అనే డబ్బింగ్ మూవీ కూడా వస్తోంది. సింగం సిరీస్ సినిమాలతో తెలుగులోనూ ఫేమ్ అయిన హరి డైరెక్షన్ లో ఆయన బావమరిది అరుణ్‌ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా ఇది. ట్రైలర్ కాస్త ఇంప్రెసివ్ గానే ఉంది. కానీ ఈ హీరో తెలుగులో విలన్ గానే ఎక్కువ తెలుసు. మరి ఆ ఇమేజ్ ను దాటి హీరోగా ఆకట్టుకోవాలంటే ముందు సినిమాకు జనం రావాలి. ఏదేమైనా ఒక పక్కా కమర్షిల్ తప్ ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లాంటి చిత్రాలుగానే కనిపిస్తున్నాయి.

Related Posts