ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గింపు పై నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్లో సినిమా టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. సినీ ప్ర‌ముఖులు ఎవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు కానీ.. ఈరోజు హీరో నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ నాని ఏమ‌న్నారంటే.. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు.

శ్యామ్‌సింగరాయ్‌ చిత్రబృందం ఏర్పాటు చేసిన‌ మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే.. నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది అని నాని వ్యాఖ్యానించారు.

నాని ధైర్యం చేసి ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు. మ‌రి.. ముందు ముందు నానికి స‌పోర్ట్ చేస్తూ.. మ‌రి కొంత మంది సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తారేమో చూడాలి. మ‌రి.. నాని వ్యాఖ్య‌ల పై ఏపీ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందేమో అనేది ఆస‌క్తిగా మారింది.

Telugu 70mm

Recent Posts

The team is going to share the experiences of ‘Arya’

'Arya' movie.. Allu Arjun is the hero of the movie. The film that gave life…

17 mins ago

6 crores for a guest appearance

Manchu Vishnu is producing the mega project 'Kannappa'. This film is being made with a…

37 mins ago

Vikram’s son Dhruv as hero in ‘Bison’

Vikram's son Dhruv is getting ready with a crazy movie. Dhruv made his debut as…

57 mins ago

Film fair at the box office on May 10

Apart from one or two films this summer, there have been no films that have…

1 hour ago

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ లిల్లీ

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. 'టిల్లు స్క్వేర్'లో లిల్లీగా గ్లామరస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది.…

2 hours ago

A series of films from Sithara Entertainments

Sithara Entertainments, which started as a subsidiary of Haarika and Hassine, is now one of…

2 hours ago