నాని `టక్ జగదీశ్` సోహెల్ `బూట్ క‌ట్ బాల‌రాజు`

బూట్ కట్ బాలరాజు గా రాబోతున్నారు బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌. ఈ చిత్రంలో వకీల్ సాబ్ ఫేమ్ అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ల‌క్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న `బూట్ క‌ట్ బాల‌రాజు` సినిమాను కొత్త దర్శకుడు శ్రీ కోనేటి తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి అతిథులుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ – గ‌త ఆరేడు నెల‌లుగా సోహెల్‌తో ఒక పాయంట్ అనుకుని దాన్ని ఒక క‌థ‌గా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జ‌రిపాం. కోనేటి శ్రీ‌ను నా మిత్రుడు చాలా ఏళ్లుగా మేమిద్దరం క‌లిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇలాంటి క‌థ సోహెల్ కి క‌రెక్ట్. హుశారు త‌ర్వాత ఆ త‌ర‌హాలో మ‌రో మంచి క‌థ‌లో వ‌స్తున్న‌ సినిమా బూట్‌క‌ట్ బాల‌రాజు. అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ – “బిగ్‌బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చేస్తున్న రెండో చిత్ర‌మిది. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. బూట్ క‌ట్ బాల‌రాజు అనే క్యారెక్ట‌ర్ డెఫినెట్‌గా మీ అంద‌రిలో ఉండిపోతుంది. అన్ని వ‌ర్గాల వారు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు. కోనేటి శ్రీ‌ను చాలా ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌. దాదాపు తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాం“ అన్నారు.

Telugu 70mm

Recent Posts

Varsha Bollamma

13 mins ago

Eesha Rebba

18 mins ago

ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో పడేసిన ప్రభాస్ పోస్ట్

రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాకి చాలా లేటుగా ఎంటరయ్యాడు. పైగా ప్రభాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అరుదుగా ఉంటాయి.…

44 mins ago

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

5 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

5 hours ago