వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా పాటలు, టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14 – తిరుపతి, సెప్టెంబర్ 15 – నెల్లూరు, ఒంగోలు, సెప్టెంబర్ 16 – విజయవాడ, గుంటూరు, ఏలూరు, సెప్టెంబర్ 17 – భీమవరం, రాజమండ్రి, సెప్టెంబర్ 18 – కాకినాడ , వైజాగ్ లో హీరో నాగశౌర్యతో పాటు చిత్ర యూనిట్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులు, అభిమానులని కలసి సందడి చేయనుంది.అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.
The first single update from Man of Masses NTR's most awaited movie 'Devara' is here.…
Anasuya, who gained a lot of popularity on the big screen as an anchor, continues…
యాంకర్ గా బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. వెండితెరపై సైతం అడపాదడపా పాత్రలతో అలరిస్తూనే ఉంది. అయితే.. అనసూయ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. మే 20న…
ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ 'లవ్ మీ'.…
హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు…