నాగచైతన్య, సాయిపల్లవి వాలెంటైన్స్ డే స్పెషల్

ఆన్ స్క్రీన్ పై నాగచైతన్య, సాయిపల్లవి క్యూట్ పెయిర్. ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని ప్రేమలోకంలో విహరింపజేసిన ఈ జంట.. మరోసారి ‘తండేల్’ కోసం జోడీ కట్టారు. ఈ సినిమాలో చైతన్య రాజు పాత్రలో జాలరిగా కనిపించబోతుండగా.. అతని ప్రియురాలిగా బుజ్జి పాత్రలో సాయిపల్లవి అలరించబోతుంది.

ఇటీవలే ఓ మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘తండేల్’ టీమ్.. నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఇక వాలెంటైన్స్ డే స్పెషల్ గా నాగచైతన్య, సాయిపల్లవి.. ఫ్యాన్స్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘ఎస్సెన్స్ ఆఫ్ తండేల్’లోని డైలాగ్స్ తో చైతన్య, సాయిపల్లవి రీల్ చేశారు. వీడియో కాల్ లో ‘బుజ్జి తల్లి.. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే’ అంటూ చైతన్య అంటే.. దానికి సాయిపల్లవి ఇచ్చిన క్యూట్ స్మైల్ ఈ వీడియోలో అదిరిపోయింది. ప్రస్తుతం ‘తండేల్’ వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ‘తండేల్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts