ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్’

మెగాప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ఐఏఎఫ్‌ ఆఫీసర్‌ గా యాక్ట్ చేస్తున్న మూవీ ఆపరేషన్‌ వాలెంటైన్. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్‌ గా మానుషి చిల్లర్ యాక్ట్ చేసారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయక్తంగా శక్తి ప్రతాప్‌ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. మార్చి 1 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు.


దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్లను అద్భుతంగా చూపించబోతుంది ఆపరేషన్‌ వాలెంటైన్‌. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, వందేమాతరం, గగనాల చార్ట్ బస్టర్ సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
రుహాని శర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మేకర్స్ రుహాని శర్మను తాన్య శర్మగా పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ యూనిఫాంలో డైనమిక్ గా కనిపించింది రుహాని శర్మ.