టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు పై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ సినిమా కంటే ముందుగా నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆతర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.
ఇందులో కింగ్ నాగ్ కు జోడీగా సొనాల్ చౌహాన్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున కత్తిపట్టుకుని క్లీన్ షేవ్ తో హత్యలు చేస్తూ కనిపించాడు.
అయితే… ఇందుకు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నాగార్జున సరికొత్త గెటప్ లో మునుపెన్నడూ చూడని మేకోవర్ తో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రిటైర్డ్ రా ఏజెంట్ గా నాగ్ నటిస్తున్న ఈ మూవీలో ఆయన పాత్ర ఇదేనంటూ గుబురు మీసాలు గడ్డంతో కనిపిస్తున్న నాగార్జున స్టిల్ బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. నాగ్ న్యూ లుక్ నిజంగానే దిఘోస్ట్ మూవీలోనిదా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.
ఇళయరాజా.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి.. తన విభిన్నమైన సంగీతంతో…
ప్రస్తుతం తెలుగులో ఉన్న విలక్షణ దర్శకుల్లో క్రిష్ ఒకరు. తొలి సినిమా ‘గమ్యం‘ నుంచి తనకంటూ ప్రత్యేక పంథాను ఏర్పరచుకుని…
‘అజ్ఞాతవాసి‘ తర్వాత సినిమాలు చేస్తాడా? లేదా? అనే సస్పెన్స్ కు తెరదించుతూ.. ‘వకీల్ సాబ్‘తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడు పవర్…
Rajamouli is the first in the list of directors who have not failed in Telugu.…
Succession is very common in film industry. Almost all the star heroes in the Telugu…
An unexpected update has come from Power Star Pawan Kalyan's first period drama 'Hari Hara…