‘కల్కి’ కథ చెప్పేసిన నాగ్ అశ్విన్.. ‘మహాభారతం’తోనే మొదలవుతుంది

రెబెల్ స్టార్ ప్రభాస్.. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఎడి’. ఈ సినిమా టైటిల్ లోనే ఈ చిత్రం ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా అర్థమవుతోంది. అయితే.. ఈ సినిమాలో కేవలం ఫ్యూచర్ మాత్రమే కాదు.. మన పురాణాలతో లింక్ పెడుతూ పాస్ట్ ని కూడా చూపించబోతున్నాడట డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో మహాభారతాన్ని ఆవిష్కరించనున్నాడట.

ఇదే విషయాన్ని లేటెస్ట్ గా గుర్గావ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో బయటపెట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హీరో రానా తో పాటు నాగ్ అశ్విన్ పాల్గొన్న ఈ ఈవెంట్ లో.. ‘కల్కి 2898ఎడి’ గురించి ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు. ‘కల్కి’ కథ మొత్తం ఆరువేల సంవత్సరాల స్పాన్ లో జరుగుతుందట. క్రీస్తూ పూర్వం 3102లో జరిగినట్టుగా ప్రచారంలో ఉన్న ‘మహాభారతం’తో మొదలై.. క్రీ.శ. 2898 లో అంతమవుతోందని తెలిపాడు నాగ్ అశ్విన్. అంటే.. ఈ చిత్రంలో మహాభారత యుద్ధాన్ని కూడా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో ప్రభాస్ కర్ణుడుగా కనిపిస్తాడనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. ఆ కర్ణుడి నే ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కల్కి గా ప్రయోగిస్తారని.. అదే ‘కల్కి 2898 ఎడి’ స్టోరీ అంటూ ఓ కథ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మొత్తంమీద.. రెబెల్ స్టార్ ప్రభాస్ ను ‘కల్కి 2898 ఎడి’తో మరో పౌరాణిక పాత్రలో చూడబోతుండడం కన్ఫమ్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది మే 9న ‘కల్కి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts