నా పేరు శివ 2 అంటూ వస్తోన్న సినిమా అసలు కథేంటీ..

తమిళ్ స్టార్ హీరో కార్తీకి కెరీర్ ఆరంభంలో మంచి మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో నా పేరు శివ ఒకటి. లవ్, ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ కార్తీతో కాజల్ హీరోయిన్ గా నటించింది. 2010లో సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీపై రివ్యూస్ కూడా అద్భుతంగా వచ్చాయి. నాన్ మహాన్ అల్లా అనే పేరుతో తమిళ్ లో, నా పేరు శివ అనే పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడా మంచి విజయమే సాధించింది. అయితే ఇన్నాళ్లకు మళ్లీ నా పేరు శివ2 అంటూ ఈ సంక్రాంతికి రిలీజ్ అంటూ కొత్త పోస్టర్స్ పడుతున్నాయి. అయితే సినిమా దర్శకుడుగా పా రంజిత్ పేరు పడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు మొదలైందీ.. ఇంత సడెన్ గా విడుదల అంటున్నారేంటీ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు కథ వేరే ఉంది. ఇది నా పేరు శివ2 చిత్రం కాదు. ఇంకా చెబితే ఆ చిత్రానికి సంబంధమే లేదు.
ఈ సినిమాకు దర్శకుడు పా రంజిత్. అయితే ఇది ఇప్పుడు రూపొందిన సినిమా కాదు. 2014లో కార్తీ హీరోగా పా రంజిత్ రెండో సినిమాగా వచ్చిన మద్రాస్ అనే తమిళ్ సినిమాకు తెలుగు అనువాదం. అంటే మద్రాస్ చిత్రాన్ని తెలుగులో నా పేరుశివ2 పేరుతో విడుదల చేస్తున్నారన్నమాట. విశేషం ఏంటంటే.. ఈ మద్రాస్ సినిమా చూసిన తర్వాతే రజినీకాంత్ పా రంజిత్ కు కబాలి అవకాశం ఇచ్చాడు.


మద్రాస్ కూడా అద్భుత విజయం సాధించిన చిత్రమే.ఈ సినిమా వచ్చే టైమ్ కు కార్తీ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అప్పుడే అట్టకత్తి అనే చిత్రంతో ఆకట్టుకున్న పా రంజిత్ కు ఛాన్స్ ఇచ్చాడు కార్తీ. తూర్పు మద్రాస్ లోని స్లమ్ ఏరియాస్ లో సాగే కథగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి పా రంజిత్ గురించి అంతా మాట్లాడుకునేలా చేసింది.
అయితే ఏ మాటకామాటే.. ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందా అని చాలామంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు వస్తోందన్నమాట. ఈ సంక్రాంతికి 14న విడుదల చేయబోతున్నారు. కంటెంట్ పరంగా చూస్తే ఇప్పటికీ ఇది రిలవెంట్ గా ఉంటుంది. కాబట్టి ఏ మాత్రం బోర్ లేకుండా చూసేయొచ్చు.

Telugu 70mm

Recent Posts

మరోసారి హాలీవుడ్ కి వెళుతున్న టబు

రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచిన హైదరాబాదీ బ్యూటీ టబు. మూడు దశాబ్దాల క్రితం వెంకటేష్ 'కూలీ నంబర్…

6 hours ago

విజయ్ సినిమాలకు హీరోయిన్స్ సెట్..!

రౌడీ స్టార్ విజయ్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో బిజీ అయ్యాడు. వీటిలో ఒకటి గౌతమ్ తిన్ననూరితో కాగా.. మరో…

6 hours ago

సూపర్ హీరోతో ఫిక్సైన పూరి జగన్నాథ్

టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమాలను పూర్తి చేసే డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.…

8 hours ago

ఈవారం చిన్న సినిమాలదే హవా

ఎన్నికల వేడి చల్లారింది. జనం అంతా ఇప్పుడు ఎంటర్‌టైన్ మెంట్ మూడ్ లో ఉన్నారు. కాలక్షేపం కోసం కొత్త సినిమాల…

8 hours ago

ఎన్నికలు పూర్తయ్యాయి.. ఇక సినిమాలపైనే ఆ ఇద్దరి ఫోకస్..!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి చల్లారింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చే వరకూ ఫలితాలపై టెన్షన్ కొనసాగుతోంది. కానీ.. ఈలోపులో…

10 hours ago

‘పుష్ప 2’ కోసం డేట్స్ కేటాయించిన ఫహాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ 'పుష్ప 2'. ఇండిపెండెన్స్‌ డే స్పెషల్ గా ఆగస్టు 15న ఈ…

10 hours ago