ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
వైష్ణవి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.దర్శకుడు ఎస్ ఎస్ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
సందీప్ కిషన్ హిట్ మూవీస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ జెడ్' ఒకటి. తమిళంలో సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన 'మాయవన్' సినిమాకి…
విలక్షణ నటుడు ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న రెండో చిత్రం 'రాయన్'. జూన్ 13న పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ…
నేటితరం యువ కథానాయకుల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల 'గామి'తో డీసెంట్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ 'దేవర'. అక్టోబర్ లో విడుదలకు ముస్తాబవుతోన్న 'దేవర' ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది…
Ram Charan and Upasana couple reached Delhi on the occasion of awarding Padma Vibhushan award…
Janasenaani Pawan Kalyan is getting an unexpected response from the film industry. Apart from family…