మంగ్లీ (సత్యవతి)…. ఫోక్ సింగరే కాదు.. స్టార్ సింగర్..

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

• జననం అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండ
• జాతీయత భారతీయురాలు
• వృత్తి న్యూస్ ప్రజెంటర్, వ్యాఖ్యాత,నటి
• క్రియాశీల సంవత్సరాలు 2014 -ప్రస్తుతం
• బంధువులు ఇంద్రావతి చౌహాన్ (చెల్లెలు)

జననం, బాల్యం
మంగ్లీ అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5వ తరగతి చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT (Rural Development Trust) సంస్థ ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. ఆదే సంస్థ సలహాతో, ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వీ. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.

జీవిత విశేషాలు
ఆమె జీవితం మలుపు తిప్పింది మాత్రం RDT సంస్థనే. RDT చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది. అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.

మంగ్లీ గా
ఒకసారి V6 టీవీ చానెల్ లో జానపద కార్యక్రమం జరుగుతుంటే బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం తర్వాత ఆ చానెల్ వారు ‘యాంకర్ గా చేస్తావా?’ అని అడిగారు. ఆ విధంగా యాంకర్ అయ్యింది. ‘సత్యవతి’ పేరుకన్నా ఇంకేదైనా పేరు పెట్ట్టుకోమంటే, మంగ్లీ అనే తన తాతమ్మ పేరు ‘మంగ్లీ’ అనే పేరు ఎంచుకుంది. ఆ పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత చేసిన ‘తీన్మార్’ తీన్మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. అందుకే టివీ నుండి బయటకు వచ్చి ‘మైక్’ టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన “రేలా……రేలా….రే.” పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. ఆ తర్వాత సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది. అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ ‘గోర్ జీవన్’ అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.

నటించిన సినిమాలు
• ఊల్లాల ఊల్లాల (2020)
• మాస్ట్రో (2021)

మంగ్లీ పాడిన పాటల జాబితా ఇది:
సంవత్సరం ఛానలు పాట సంగీతం సాహిత్యం సహగాయకులు యూట్యూబ్లో వీక్షణలు
• 2018 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ డా. నందిని సిధారెడ్డి 50+ లక్షలు
• 2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి అమీన్ కాసర్ల శ్యామ్ 20+ లక్షలు
• 2018 ఆదిత్య మ్యూజిక్ చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్ 16+ లక్షలు
• 2018 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్ మట్ల తిరుపతి మట్ల తిరుపతి 100+ లక్షలు
• 2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్ 34+ లక్షలు
• 2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ జంగిరెడ్డి 97+ లక్షలు
• 2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్ డా. కందికొండ 10 లక్షలు
• 2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ 45+ లక్షలు
• 2018 RTV బంజారా బంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణ యాకూబ్ నాయక్ 42+ లక్షలు
• 2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి భుజంగ్ డా. కందికొండ శిశిర 100+ లక్షలు
• 2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్ డా. కందికొండ ర్యాపర్:మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్) 22+ లక్షలు
• 2018 మ్యాంగో మ్యూజిక్ పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్ డా. కందికొండ రంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్,బొబ్బిలి సురేష్, శంకర్ బాబు 3+ లక్షలు
• 2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట 2.5+ లక్షలు
• 2017 ఐ డ్రీమ్ బతుకమ్మ పాట పుల్లిగిళ్ళ ప్రమోద్ తైదల బాపు పుల్లిగిళ్ళ ప్రమోద్ 38+ లక్షలు
• 2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్ పోలం సత్య సాగర్ రాహుల్ సిప్లిగంజ్ 35+ లక్షలు
• 2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్ మిట్టపల్లి సురేందర్ సాకేత్ 300+ లక్షలు
• 2017 ఫ్యూచర్ ఫిల్స్మ్ అమ్మవా రాతిబొమ్మవా (జానపద గీతం) ముస్తఫా 110+ లక్షలు
• 2017 మైక్ టీవీ రేలా రే రేలా రే బొబ్బిలి నందన్ డా. కందికొండ లిప్సిక 160+ లక్షలు

Telugu 70mm

Recent Posts

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

17 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

18 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

18 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

18 hours ago

‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌సంగీతం:…

19 hours ago

Mahesh-Rajamouli film’s Muhurtham fix?

The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…

22 hours ago