Latest

గ్రాఫిక్స్ పర్వంలోమంచు లక్ష్మి “ఆదిపర్వం”

రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ మరియు ఎ. వన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో రూపుద్దిద్దుకుంటున్న చిత్రం “ఆదిపర్వం”. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు సంజీవ్ మేగోటి. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామా అని ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ చాలా హైలైట్ గా నిలుస్తుందని… “అమ్మోరు, అరుంధతి” చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సిద్ధం అవుతోందని, ఇటీవల విడుదలయి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న “హనుమాన్” చిత్రం లాగే ఈ సినిమా కూడా అద్భుతమైన సక్సెస్ సాధిస్తుందని “నాగలాపురం నాగమ్మ”గా మంచులక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ “ఈ చిత్రంలో మంచులక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మంచులక్ష్మితోపాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీరాజేశ్వరి ఇలా చాలా మంచి నటీనటులు తమతమ పాత్రల్లో విజృంభించారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని ఒక మంచి ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా దర్శకుడు సంజీవ్ మేగోటి అహర్నిశలు కష్టపడుతున్నారని, అలాగే చిత్రంలో నాగమ్మగా చేస్తున్న మంచులక్ష్మిగారు ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన ఫైట్స్ చేశారని, ఆ రెండు ఫైట్స్ చిత్రానికి మరో హైలెట్ అని, క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా అద్భుతంగా చేశారు” అని తెలిపారు. చిత్ర సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి ‘ఆదిపర్వం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే చూసి చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అయ్యానని’ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. “ఆదిపర్వం గ్రాఫిక్స్ ప్రాధాన్యతతో పాటు కసికొద్దీ పాత్రలో పరకాయప్రవేశం చేసి ఒప్పించి మెప్పించ గల నటి మంచు లక్ష్మిలాంటి ఈ చిత్రాన్నికి మరో మంచి ఎస్సెట్” అని చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు అన్నారు.

ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెటగాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

12 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

13 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

13 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

13 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

19 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

19 hours ago