మానాడు మాదే అంటోన్న సురేష్ బాబు

టైమ్ ట్రావెలింగ్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటికి థ్రిల్ ను మిక్స్ చేసి హాలీవుడ్ లో అనేక చిత్రాలు కనిపించాయి. ఇండియాలో ఈ తరహా ప్రయత్నాలు జరగలేదు. జరిగినా చాలా వరకూ బోర్ కొట్టించాయి. కొన్నాళ్ల క్రితం జగపతిబాబు హీరోగా క్లైమాక్స్ లో ఉన్నప్పుడు ఏప్రిల్ ఫూల్ అనే సినిమా వచ్చింది. అది కూడా ఈ తరహా చిత్రమే కానీ.. దర్శకత్వ లోపం మొదటి పది నిమిషాల నుంచే పరమ బోరింగ్ అనిపించుకుందా చిత్రం. రీసెంట్ గా ఇదే పాయింట్ తో తమిళ్ లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా మానాడు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ లూప్ పేరుతో విడుదల చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కారణం ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకోవడమే. ఇక మొన్నటి వరకూ మానాడు రీమేక్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తీసుకున్నాడనీ.. అల్లు శిరీష్ తో రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. బట్ ఈ రైట్స్ ను లేటెస్ట్ గా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ దక్కించుకుంది.
టైమ్ ట్రావెల్ రూపంలో వచ్చిన ఈ మూవీ అద్భుతమైన చిత్రంగా టాప్ రేటింగ్స్ అందుకుంది. శింబు, సూర్య పాత్రలు హైలెట్ గా ఓ రేంజ్ థ్రిల్లర్ గా ఎంటర్టైన్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత శింబుకు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి చిత్రాన్ని రానా హీరోగా రీమేక్ చేస్తారు అంటున్నారు. నిజానికి ఈ మూవీని ఇదే స్క్రిప్ట్ తో కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఏ భాషలో అయినా అదే స్థాయిలో విజయం సాధిస్తుంది. నేటివిటీ కోసం మార్పులు అంటూ మొదలుపెడితే మొత్తానికే మోసం వస్తుంది. మరి సురేష్ బాబు రీమేక్స్ ను తీయడంలో ఎక్స్ పర్ట్ కదా.. ఇక ఈ చిత్రాన్ని ఎలా రూపొందిస్తాడో చూడాలి. రీమేక్ లో థియేట్రికల్ రైట్స్ తో పాటు తెలుగు డబ్బింగ్ రైట్స్ ను కూడా తీసుకున్నాడు సురేష్ బాబు. ఏదేమైనా లూప్ గా తెలుగులో వస్తే చూడాలనుకున్న చాలామందికి ఇప్పుడు స్ట్రెయిట్ గానే వస్తోన్న ఈ చిత్రం మనవారికి ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.

Related Posts