Pawan Kalyan : మామా అల్లుళ్లు ఆ టైటిల్ కే ఫిక్స్ అయ్యారు.. “బ్రో”..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఆయన మేనల్లుడు సాయితేజ్ కలిసి నటిస్తున్నారు అన్నప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఓ జోష్‌ కనిపించింది. అది రీమేక్ అని తెలిసినా మామా అల్లుళ్లు చేస్తున్నారు అన్నప్పుడు వారి ఫ్యామిలీలోకూడా ఆసక్తి ఉంటుంది కదా..?

తమిళ్ లో సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదాయ సీతమ్” అనే చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్‌, సాయితేజ్ హీరోలుగా అదే దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌ దేవుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆల్రెడీ ఆయన వెంకటేష్ తో కలిసి గోపాలా గోపాలా అనే చిత్రంలో శ్రీ కృష్ణుడుగా కనిపించారు.ఇప్పుడు మరోసారి దేవుడు పాత్ర చేయడం విశేషం.

పవన్ కళ్యాన్ కు సంబంధించి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ టైటిల్ విషయంలో కొన్నాళ్లుగా రకరకాల పేర్లు వినిపించాయి. అందులో ప్రధానంగా చెప్పుకున్నది ” బ్రో ” అనే టైటిల్ గురించి. బట్ ఈ టైటిల్ బాలేదు.. వేరే టైటిల్ పెట్టాలని ఫ్యాన్స్ నుంచే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.కానీ మూవీ టీమ్ అభిమానుల మాటలను పట్టించుకోలేదు. కథానుసారగంగానే కమిట్ అయినట్టున్నారు.

అందుకే లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ను అదే పేరుతో అనౌన్స్ చేశారు. దీంతో పాటు ఓ వీడియో గ్లింప్స్ కూడా వచ్చింది. సంస్కృతంలో ఓ శ్లోకం వినిపిస్తుండగా.. పవన్ ఇమేజ్ పైనే అదిరిపోయే తమన్ నేపథ్య సంగీతంలో బ్రో అనే సాంగ్ వర్డ్ తో ఉందీ వీడియో. తమన్ ఆర్ఆర్ వల్లేమో ఇంకా బాగా అనిపించింది.
సో పవన్ కళ్యాణ్‌ – సాయితేజ్ కలిసి నటిస్తోన్న సినిమా పేరు బ్రో అని అఫీషియల్ గా అనౌన్స్ అయిందన్నమాట.

ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సముద్రఖని అయినా.. తెలుగు వెర్షన్ కు సంబంధించి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను త్రివిక్రమ్ రాశాడు. అంటే చాలా మార్పులను ఎక్‌స్ పెక్ట్ చేయొచ్చు. నిజానికి తమిళ్ వెర్షన్ చూసిన వారికి ఇది పవన్ చేయాల్సినంత పెద్ద పాత్ర కాదు అనిపిస్తుంది.

కానీ త్రివిక్రమ్ ఎంటర్ అయ్యాడు కాబట్టి.. ఆయన సీన్స్ తో పాటు కథలో కూడా మార్పులు వచ్చి ఉంటాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై జీ స్టూడియోస్ తో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మించిన సినిమా ఇది. ఈ జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Telugu 70mm

Recent Posts

మూడు సినిమాలతో బిజీగా విజయ్ దేవరకొండ

హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం…

58 mins ago

చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన సందర్భం

ఈతరం నటుల్లో అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్. ఒక డైలాగ్ చెప్పాలన్నా.. డ్యాన్సులు…

2 hours ago

‘కుబేర’ కోసం సరికొత్తగా కింగ్ నాగార్జున

కథ నచ్చితే చాలు కాంబినేషన్స్ గురించి అస్సలు పట్టించుకోడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే.. పలు మల్టీస్టారర్స్ కి ఓ.కె. చెబుతుంటాడు.…

2 hours ago

‘Baahubali.. Crown of Blood’ trailer.. Mahishmati is going to be shown in a new series

Director Rajamouli is known for the sensational success of his magnum opus 'Baahubali'. A television…

16 hours ago

‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్‘ ట్రైలర్.. మహిష్మతిని కొత్తగా చూపించబోతున్న సిరీస్

దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి‘ సృష్టించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ‘బాహుబలి‘ మూవీ సిరీస్ లోని పాత్రలు,…

16 hours ago

‘Jithender Reddy’ trailer.. Intense political thriller

The movie 'Jithender Reddy' starring Rakesh Varre of 'Baahubali' fame in the lead role. 'History…

17 hours ago