నాన్ స్టాప్ గా మహేష్‌ – త్రివిక్రమ్ మూవీ

లేట్ అయినా లేటెస్ట్ గా అంటుంటారు కదా..అలా మొదలుపెట్టారు మహేష్‌ బాబు, త్రివిక్రమ్. 2022లోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయింది. బట్ ఒక షెడ్యూల్ తర్వాత మరీ హెవీగా ఉందని నో చెప్పాడు మహేష్ బాబు. అలా కాకుండా త్రివిక్రమ్ స్టైల్లో సాగే స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలని అడిగాడు.

త్రివిక్రమ్ రెడీ చేశాడు. ఈ లోగా సూపర్ స్టార్ కృష్ణగారు కన్నుమూశారు. దీంతో డిసెంబర్ లోనే స్టార్ట్ కావాల్సిన కొత్త సినిమా ఆగిపోయింది. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు ఈ బుధవారం నుంచి నాన్ స్టాప్ గా గూడ్ న్యూస్ చెబుతున్నారు.. మేకర్స్.


పన్నెండేళ్ల తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. పైగా త్రివిక్రమ్ చివరగా అల వైకుంఠపురములోతో బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. మహేష్‌ కూడా సరిలేరు నీకెవ్వరు, సర్కారువారి పాట హిట్స్ తో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్స్ పై అంచనాలు మరింత పెరిగాయి. అంతకు ముందు వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా కంప్లీట్ క్లాస్ మూవీస్. మాస్ ను మెప్పించినా ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా ఉంటాయి. అందుకే ఈ సారి ఓ యాక్షన్ ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు త్రివిక్రమ్. కథ కూడా ఓకే అయింది.

మరి ఎందుకో ఫస్ట్ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీసిన తర్వాత మహేష్ కు నచ్చలేదు. దీంతో ఆ షెడ్యూల్ ను పూర్తిగా పక్కనబెట్టి.. కంప్లీట్ గా మరో ఫ్రెష్‌ స్టోరీతో రాబోతున్నారు. మధ్యలో మహేష్‌ ఇంట్లో జరిగిన విషాదం వల్ల కాస్త ఆలస్యం అయింది. అయితే ఆ తర్వాత ఏ అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత గందరగోళం నెలకొంది. బట్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఈ సారి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ తో ఈ బుధవారం నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఈ షెడ్యూల్ ను నాన్ స్టాప్ గా షూట్ చేస్తారట. మహేష్‌ బాబు సరసన పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మహేష్‌ బాబు లుక్ చాలా చాలా స్టైలిష్‌ గా ఉంటుందంటున్నారు. ఇక హారిక హాసిని బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం తమన్, పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. మొత్తంగా పెద్దగా గ్యాప్ లు లేకుండా చూసుకుని వీలైనంత వేగంగా షూటింగ్ ఫినిష్‌ చేసి ఈ యేడాదే విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి గతంలో వచ్చిన అతడు, ఖలేజా ఆశించినంత పెద్ద విజయాలు కాదు. మరి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అనేది చూడాలి.

Related Posts