మొన్న తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు..

హిట్.. ఈ మాట ఎన్నో కమెంట్స్ కు ఆన్సర్ చెబుతుంది. ఈ మాటకు ముందు వరకూ ఎన్నో విమర్శలు చేసిన వాళ్లు కూడా మళ్లీ పొగడటం మొదలుపెడతారు. విజయానికి ఉండే పవర్ అలాంటిది. ఆ పవర్ తోనే ఇప్పుడు మాస్ రాజా మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు.

లాస్ట్ ఇయర్ ధమాకాకు ముందు వరకూ దారుణంగా విమర్శించిన వారు కూడా ధమాకా బ్లాక్ బస్టర్ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఆ మూవీ వంద కోట్లు కొల్లగొట్టిన నెల లోపే మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలాంటి ఫీట్ ను అతను 13యేళ్ల క్రితం సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు రిపీట్ అయింది. మరి మాస్ రాజా జోష్‌ కు కారణమేంటో తెలుసు కదా..?


మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ ఒకప్పుడు నిలకడగానే ఉన్నా.. కొన్నాళ్లుగా ఒక్క హిట్ పడితే రెండు మూడు ఫ్లాపులు వస్తున్నాయి. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతో రెండు ఫ్లాపులు చూశాడు. ఈ రెండు ఫ్లాపులకే అతనిపై చాలామంది కమెంట్స చేశారు. ఇలాంటి నాసిరకం కథలు ఎంచుకుంటున్నాడు.. ఇలాగే ఉంటే ఇక రవితేజ పని ఐపోయినట్టే అన్నారు.

పైగా ఆ రెండు సినిమాల్లో కాస్త సీరియస్ గా కనిపిస్తాడు రవితేజ. అది అతని ఇమేజ్ కు భిన్నంగా ఉండటంతో పాటు కథలు కూడా ఆకట్టుకోకపోవడంతో మరిన్ని విమర్శలు చేశారు. బట్ సిసలైన రవితేజ సినిమా అంటూ వచ్చిన ధమాకా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇది కూడా కొత్త కథేం కాదు. అతను అంతకు ముందు చేయనిపాత్రా కాదు. అయినా కనెక్ట్ అయింది.

కనెక్ట్ అయితే కాసుల వర్షమే అన్నట్టుగా ఏకంగా కెరీర్ లోనే ఫస్ట్ వంద కోట్ల మూవీగా నిలిచింది ధమాకా. ఈ మూవీ చేస్తున్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి సరసన ఆఫర్ వచ్చింది. వాల్తేర్ వీరయ్యలో ఓ కీలకమైన పాత్రకు రవితేజను తీసుకున్నారు. చాలాయేళ్ల క్రితం రవితేజ.. అన్నయ్య సినిమాలో మెగాస్టార్ కు తమ్ముడుగా నటించాడు. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి పాత్రే. కాకపోతే కాస్త డిఫరెంట్ రోల్. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సంక్రాంతి బరిలో సత్తా చాటుతోంది.

ఈ మూవీలో రవితేజ మెయిన్ హీరో కాదు. అయినా అతని పాత్ర సినిమాకు చాలా కీలకం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సెటిల్డ్ గా నటించి సినిమాకు కావాల్సినంత ప్లస్ అయ్యాడు. వాల్తేర్ వీరయ్య కూడా వంద కోట్లు దాటింది. ఈ క్రెడిల్ లో అతనికీ షేర్ ఉంది కదా..? ఇలా బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు చేయడంతో రవితేజ కెరీర్ కు సరికొత్త జోష్ యాడ్ అయిందని చెప్పొచ్చు.

అయితే గతంలో తనే హీరోగా నటించిన మిరపకాయ్, డాన్ శీను వంటి సినిమాలు కూడా అతనికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాలు వచ్చిన ఇన్నేళ్లకు మళ్లీ అలాంటి ఫీట్ సాధించాడు. మరి ఈ విజయాలతో రవితేజ మార్కెట్ తో పాటు రెమ్యూనేషన్ కూడా పెరుగుతుందని వేరే చెప్పాలా..?

Related Posts