ఫ్రీజింగ్ టెంపరేచర్ లో మహేష్ ట్రెక్కింగ్

ఇప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే.. రాజమౌళితో చేయబోయే సినిమా మరో ఎత్తు అనొచ్చేమో!. ఎందుకంటే జక్కన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు. అదో చరిత్ర సృష్టించేదిగా ఉంటుంది. అందుకోసం.. హీరోలు ఇంతకుముందు చేయని సాహసాలు చేయాలి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతొచ్చింది. ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ప్రిన్స్.. ఈసారి తన 29వ సినిమాకోసం మరింత కష్టపడుతున్నాడు.

జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ లో ఫ్రీజింగ్ టెంపరేచర్స్ లో ట్రెక్కింగ్ చేస్తున్నాడు. తన ఫిట్ నెస్ ట్రైనర్ డా.హ్యారీ కోనిగ్ తో కలిసి బ్లాక్ ఫారెస్ట్ లో విహరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్. కొన్ని రోజులపాటు సాగే ఈ రిగరస్ ట్రైనింగ్ తో మరింత ఫిట్ గా మారనున్న మహేష్ రాజమౌళితో తన అడ్వంచరస్ జర్నీకి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్-రాజమౌళి మూవీ మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుందట.

Related Posts