ఆగస్ట్ 9 కొత్త సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమా ఎప్పుడు చేశారు.. అని షాక్ అవుతున్నారా..? ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. ఇంకా చెబితే అప్పుడు రిలీజ్ అయింది కూడా. అయినా మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. యస్.. సౌత్ లో రీ రిలీజ్ అనే ట్రెండ్ పురాతన కాలం నుంచే ఉంది. ఈ మధ్య ఎవరూ చేయడం లేదు. అందుకే మహేష్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. పైగా ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. దీంతో క్వాలిటీ కూడా బాగా పెరిగి ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటీ అంటారా..? సూపర్ స్టార్స్ బ్లాక్ బస్టర్ పోకిరి.పోకిరి .. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2006 ఏప్రిల్ 16న విడులైంది. కానీ ఈ మూవీకి ఫస్ట్ వీక్ డివైడ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత పికప్ అయింది. ఆ తర్వాత ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేంతగా దూసుకుపోయింది. 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు ప్రదర్శించబడి ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇటు అవార్డుల పరంగానూ ఏకంగా ఐదు నంది అవార్డులు, రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఇక ఈ మూవీ డైలాగ్స్ ఇప్పటికీ చాలామంది అలవోకగా అనేస్తుంటారు కూడా.
పోకిరి తమిళ్, కన్నడ, హిందీతో పాటు బంగ్లాదేశీలోనూ రీమేక్ కావడం విశేషం. అలాంటి మూవీకి ఇప్పటి టెక్నాలజీతో అప్డేట్ చేసి రీ రిలీజ్ చేయడంలో ఆశ్చర్యం ఏముందీ..?పోకిరి చిత్రానికి 4కె ఆల్ట్రా సౌండ్ సిస్టమ్ ను సెట్ చేశారిప్పుడు. ఈ కొత్త వెర్షన్ ను వచ్చే నెల 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్శీస్ లో కూడా భారీగానే విడుదల చేయబోతున్నారట. ఏదేమైనా సర్కారువారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమాకు చాలా టైమ్ ఉంది. ఆ గ్యాప్ ను ఈ పోకిరి ఫిల్ చేయబోతోందన్నమాట. ఇక ఈ మూవీలో ప్రకాష్ రాజ్ విలనీ, నాజర్ క్యారెక్టర్, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్ కామెడీ ట్రాక్ తో పాటు ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ సైతం హైలెట్ గా నిలిచాయి. సో ఇప్పుడు ఈ రీ రిలీజ్ లో మరోసారి ఎంటర్టైనర్ చేయబోతున్నాయన్నమాట.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…