Mahesh babu – Trivikramఅమరావతికే ఓటు వేస్తోన్న మహేష్‌ బాబు – త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు(Mahesh babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తోన్న థర్డ్ మూవీ షూటింగ్ గతంలోనే స్టార్ట్ అయింది. మొదట్లో ఒక షెడ్యూల్ తర్వాత ఆ ప్రాజెక్ట్ ను ఆపేసి సరికొత్త కథతో మళ్లీ మొదలుపెట్టారు. ఈ చిత్రం కూడా ఒక షెడ్యూల్ పూర్తయింది. పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీ లీల( Sri Leela) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ(Ramyakrishna) ఓ కీలక పాత్ర చేస్తోంది.

మహేష్‌- త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన అతడు(Athadu), ఖలేజా(Khaleja) చిత్రాలు థియేటర్స్ లో అంచనాలను అందుకోలేకపోయాయి. అందుకే ఈ సారిమరింత స్ట్రాంగ్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రాబోతోందీ కాంబో. పైగా త్రివిక్రమ్ తో పాటు మహేష్‌ కూడా ఇప్పుడు వరుస హిట్స్ తో జోష్ లో ఉన్నారు.


కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ చిత్రం టైటిల్ విషయంలో ముందు నుంచీ కొన్ని వార్తలు ఉన్నాయి. అందులో ప్రధానంగా వినిపించిన వార్త “అమరావతికి అటు ఇటు” అనే టైటిల్. త్రివిక్రమ్ కు తన సినిమాల టైటిల్స్ లో ‘అ’ అక్షరం సెంటిమెంట్ గా ఉంది. దాన్ని కంటిన్యూ చేసేలా ఈ టైటిల్ అనుకున్నారు అన్నారు. అదే టైమ్ లో అల్లుడు గారు అనే టైటిల్ ను కూడా పరిశీలించారట. బట్ ఫైనల్ గా అమరావతి(Amaravathi)కి అటు ఇటు అనే టైటిల్ కే ఫిక్స్ అయినట్టు సమాచారం.


నిజానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. అమరావతికి అటు ఇటు మధ్య కృష్ణా నది కూడా ఉంటుంది. కథలో నది పాత్ర కూడాఉంటుందా లేదా అనేది చెప్పలేం కానీ.. ప్రస్తుతం ఏపిలో రాజకీయాలన్నీ అమరావతి కేంద్రంగా సాగుతున్నాయి. కాబట్టి అది సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేదే కొందరు చెబుతున్న మాట. ఈ మాటలోనూ నిజం ఉంది. సినిమా కోసం అమరావతి సపోర్టర్స్ లేదా వ్యతిరేకులు వర్గాలుగా విడిపోతే.. అది ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. అయినా ఈ టీమ్ ఆ టైటిల్ కే మొగ్గు చూపితే ఖచ్చితంగా కంటెంట్ కూడా ఆ కేంద్రంగా ఉంటుంది అనుకోవచ్చు. మరి ఇదేటైటిల్ ఫిక్స్ చేస్తారా లేక కొత్త పేరుతో వస్తారా అనేది చూడాలి.

Related Posts