Prabhas : ప్రభాస్ మరో లవ్ స్టోరీ చేయబోతున్నాడా..?

ఇండియాస్ డార్లింగ్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్నీ ఈ యేడాదికి పూర్తయిపోతాయి. అంటే దాదాపు 2024 జనవరి నుంచే తను పూర్తిగా ఖాళీ అయిపోతాడు. ఇక వచ్చే నెల 16న ఆదిపురుష్‌(Adipurush) మూవీ రాబోతోంది.

Prabhas Adipurush Telugu Movie HD Posters

రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో కొంత వరకూ హోప్స్ పెరిగినా.. అది రామాయణం అంటే నమ్మలేకుండా ఉన్నాడు కామన్ ఆడియన్స్. సెప్టెంబర్ 28న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తోన్న సలార్ విడుదలవుతుంది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నాడు. ప్రశాంత్ నీల్(Prashanth Neil) కేజీఎఫ్(KGF) రెండు భాగాల తర్వాత రూపొందించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

అటుపై నాగ్ అశ్విన్(Nag Aswin) డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కే(Project K) కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ అని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక మిగిలింది మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా. ఇది కూడా ఈ యేడాది వరకూ షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే సమ్మర్ రిలీజ్ లా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్(Sidharth Anand) తో ఓ స్పై థ్రిల్లర్ కమిట్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆ డేట్స్ లోనే ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు అనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరో తెలుసా..? హను రాఘవపూడి(Hanu Raghavapudi).


రీసెంట్ గా సీతారామం(Seetharamam) చిత్రంతో కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ మెప్పించిన హను రాఘవపూడి మరోసారి ఆ తరహా లవ్ స్టోరీనే సిద్ధం చేసుకున్నాడట. ఈ కథకు ప్రభాస్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుందని భావించాడు. ఈ మేరకు ప్రభాస్ ను కలిసి కథ వినిపించేందుకు రెడీ అవుతున్నాడని టాక్.అయితే ప్రభాస్ ఆల్రెడీ రాధేశ్యామ్(Radhe Shyam) మూవీతో బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ చూసి ఉన్నాడు. అయినా మరోసారి లవ్ స్టోరీ అంటే రిస్క్ అనేది అభిమానుల అభిప్రాయం. బట్ హను రాఘవపూడి ఈ తరహా రొమాంటిక్ కథలు చెప్పడంలో ఎక్స్ పర్ట్ అయిన ముందు నుంచీ చూస్తున్నాం. పైగా ఈ చిత్రానికి కూడా సీతారామం లాగా కాస్త మాస్, యాక్షన్ టచ్ జోడిస్తే.. ప్రభాస్ ఇమేజ్ తో అది ఎక్కడికో వెళుతుంది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్నదాన్ని బట్టి ప్రభాస్ ఈ మూవీ చేయడానికే మొగ్గు చూపుతాడు అంటున్నారు. ఆయనకు కూడా ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతో చేసిన రాధేశ్యామ్ పోయింది కాబట్టి.. ఆ స్థానంలో ఖచ్చితంగా ఓ మంచి లవ్ స్టోరీ చేయాలనే ఫీలింగ్ తో ఉన్నాడట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts