నాగ చైతన్య కల నెరవేరేనా..?

అక్కినేని నాగ చైతన్య(NagaChaitanya) కస్టడీ(Custody) మూవీ మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న వెంకట్ ప్రభు(Venkat Prabhu) డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో కృతిశెట్టి(Kriti Shetty) హీరోయిన్. అరవింద్ స్వామి(Aravind Swamy), ప్రియమణి(Priyamani), శరత్ కుమార్(Sharath Kumar), వెన్నెల కిశోర్(Vennela Kishore) కీలక పాత్రల్లో నటించారు.

చైతన్య అంతకు ముందు చేసిన థ్యాంక్యూ, లాల్ సింగ చద్దా పోవడంతో ఈ చిత్రంపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ట్రైలర్ ట్రెండమస్ అనిపించకపోయినా.. ఓ కొత్త కంటెంట్ అయితే చూడబోతున్నాం అనే ఫీల్ ఇచ్చింది. అదీ కాక ఇలా లో ప్రొఫైల్ లో ఉన్న ట్రైలర్స్ తోనే వెంకట్ ప్రభు పెద్ద విజయాలు సాధించాడు. ప్రమోషన్స్ పరంగా అగ్రెసివ్ గా ఉన్నారు. ముఖ్యంగా చైతూ.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ప్రతి పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుందనీ.. ఆ థ్రిల్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని పదే పదే చెబుతున్నాడు. ఇలాంటి కథలు ఇప్పటివరకూ అతను చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కొత్తగానే ఉంటుంది. కానీ కథ, ఎమోషన్ ఆడియన్స్ కనక్ట్ కావాలి. అప్పుడే వీళ్లు ఎక్స్ పెక్ట్ చేసే రిజల్ట్ వస్తుంది.
కస్టడీ చిత్రం 90ల్లో జరిగే కథగా చూపించబోతున్నారు.

ఆ మేరకు ట్రైలర్ లో ఆ యాంబియన్స్ స్పష్టంగా కనిపించింది. పాటలు పెద్దగా కనెక్ట కాలేదు కానీ.. ఇళయరాజా(Ilaya Raja), యువన్ శంకర్ రాజా(YuvanShankar Raja) అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం అనేది ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట.కృతిశెట్టితో చైతన్య రెండో సారి జత కట్టాడు. ఇక కథ నచ్చితే తప్ప కమిట్ కానీ అరవింద్ స్వామి ఈ ప్రాజెక్ట్ లోకి రావడం పెద్ద ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు.

Aravind Swami at 63rd Filmfare Awards 2016 (South) Press Meet

అలాగే ముఖ్యమంత్రి ద్రాక్షాయణి పాత్రలో నటించిన ప్రియమణి రోల్ కూడా సర్ ప్రైజింగ్ గా ఉంటుందంటున్నారు.

మొత్తంగా కథ, కథనాలు కట్టిపడేసేలా ఉంటాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. అది ఆడియన్స్ కు కరెక్ట్ గా కన్వే అయితే చైతన్యకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. మరి అతను కోరుకునే విజయం వస్తుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Related Posts