మహేష్, ప్రభాస్ పాటల పోటీ

స్టార్ హీరోలకు సంబంధించిన అప్డేట్స్ వస్తే చాలు సోషల్ మీడియా షేక్ అవుతోంది. ముఖ్యంగా.. ఆయా అగ్ర కథానాయకుల సినిమాలకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ రిలీజైన వెంటనే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఎన్ని గంటలకు ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయనే రికార్డుల కౌంటింగ్ కూడా షురూ అవుతుంది. ఈరోజు యూట్యూబ్ లో అదే జరగబోతుంది.

ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’.. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’.. ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలు వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ రిలీజవుతుంటే.. ‘సలార్’ నుంచి ఫ్రెండ్సిప్ నేపథ్యంలో ‘సూరీడే’ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ రిలీజవుతోంది. మరి.. యూట్యూబ్ లో ఈ రెండు పాటల వ్యూస్ పోటీ ఏ రేంజులో కొనసాగుతుందో చూడాలి.

Related Posts