ఏలియన్ కి డబ్బింగ్ చెబుతున్న సిద్ధార్థ్

సంక్రాంతి కానుకగా తెలుగు నుంచి పలు క్రేజీ మూవీస్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగులో సందడి చేయడానికి కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాడు. అలా.. పొంగల్ బరిలో రాబోతున్న చిత్రం ‘అయలాన్’. తెలుగులోనూ మంచి స్టార్ డమ్ ఉన్న శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రమిది. అందుకే.. ఈ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఏలియన్ కాన్సెప్ట్ తో వైవిధ్యంగా ‘అయలాన్‘ రూపొందుతోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆర్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. గతంలో శివకార్తికేయన్ తో ‘రెమో, వేళైకారన్, సీమరాజా‘ వంటి సినిమాలను నిర్మించిన ఆర్.డి.రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

https://twitter.com/kjr_studios/status/1734808959557783715/photo/1

ఇక ‘అయలాన్’ మూవీలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఏలియన్ కి విలక్షణ నటుడు సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. సిద్ధార్థ్ అనగానే కేవలం తమిళంలోనే కాదు.. ఈ సినిమాలోని ఏలియన్ రోల్ కి తెలుగులోనూ డబ్బింగ్ చెప్పే అవకాశాలున్నాయి. మరోవైపు హీరోగా ‘చిన్నా’ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సిద్ధార్థ్.. ప్రస్తుతం ‘ఇండియన్ 2’తో రెడీ అవుతున్నాడు.

Related Posts