విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు.. వ్యక్తి అరెస్ట్

టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి ఉండే కల్ట్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అత్యున్నత స్థానానికి చేరుకున్న విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా విజయ్ ని అవమానిస్తూ అసత్యపు వార్తను ప్రసారం చేశాడు. విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా.. ఆయన సినిమాలలోని హీరోయిన్ లను అవమానించే విధంగా యూట్యూబ్ వీడియోలను ప్రసారం చేయడంతో.. సదరు వ్యక్తిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Related Posts