”లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్..

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్ టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్  సినిమాని లైక్ చేయడానికి కారణం ?  
లైక్ షేర్ & సబ్స్క్రైబ్  కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ గారు అంటే ఇష్టం. ఆయన కథతో ఎక్ మినీ కథ చేశాను. ఆయనతో ఒక బాండింగ్ వుంది. ఆయన టైమింగ్ నాకు తెలుసు. ఎక్ మినీ కథ తర్వాతే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని అనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపొయింది. కథ చెప్పిన నెల రోజుల తర్వాతే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందం గా వుంది. మనస్పూర్తిగా నవ్వుకొని నవ్విస్తూ చేసిన సినిమా లైక్ షేర్ & సబ్స్క్రైబ్. అలాగే నా ఫేవరేట్ క్యారెక్టర్ ఇది.

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ కి ఫస్ట్ ఛాయిస్ మీరేనా ?
నేనే ఫస్ట్ ఛాయిస్ అని  మేర్లపాక గాంధీ గారు చెప్పారు. ఆయన మాటని నమ్ముతున్నాను. (నవ్వుతూ). ఇందులో యూట్యుబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. నా మనసుకు చాలా నచ్చింది. ఎక్స్ ప్రెస్ రాజా లా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఇంటరెస్టింగా వుంటుంది. క్యారెక్టర్ మెయిన్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. యాక్టర్ జాబ్ ని దర్శకుడు గాంధీ చాలా ఈజీ చేసేస్తారు. డైలాగ్ ని పర్ఫెక్ట్ గా రాస్తారు. ఆయన రాసింది ఆయనలా చెబితేనే కుదురుతుంది

ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్, లైక్, షేర్ ఇవన్నీ సోషల్ మీడియాలో ఒక సెగ్మెంట్ కే పరిమితం కదా .. అందరూ రిలేట్ చేసుకున్నట్లు ఎలా చేశారు ?  
నిజానికి సోషల్ మీడియాలో నేను కొంచెం వెనకబడి వున్నాను. యూట్యూబ్ అందరికీ తెలుసు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ వ్లాగ్ చేసే కుర్రాళ్ళు వున్నారు. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ మాకంటే బాగా చెప్తున్నారు.  ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేట్లు వుంటుంది. మనం ఎక్కడో వెదుకుతాం కానీ మన చూట్టునే బోలెడు ఆసక్తికరమైన కథలు వున్నాయి. ట్రావెల్ వ్లాగర్  గా మొదలైన కథ యాక్షన్ కామెడీ గా మలుపు తీసుకోవడం చాలా ఎక్సయిటెడ్ గా వుంటుంది.

ట్రైలర్ లో ‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం’ అనే డైలాగ్ వుంది కదా ? ఇందులో సీరియస్ ఇష్యూ ఏమైనా చెప్పబోతున్నారా ?
 అది వేరే షాట్ లో చెప్పే డైలాగ్. చాలా ఫన్ గా చేశాం. ఇందులో పీపుల్ ప్రొటక్షన్ ఫోర్స్ అనే గ్యాంగ్ వుంటుంది. వాళ్ళతో ఎలా జాయిన్ అయ్యాం, అక్కడ నుండి ఎలా భయపడ్డాం అనేది ఇంటరెస్టింగా వుంటుంది. కథలో ఒక సీరియస్ అవుటర్ లైన్ వుంది. అయితే దాన్నికూడా అవుట్ అండ్ అవుట్ ఫన్ గా చెప్పాం.

బ్రహ్మజీ గారితో నటించడం ఎలా అనిపించింది ?
బ్రహ్మజీ గారితో చాలా  ఫన్ వుంటుంది. అదే సమయంలో ఒక సీన్ చేస్తున్నపుడు ఎలా చేయాలో చర్చిస్తుంటారు. సిందూరం నుండి ఇప్పటివరకూ ఆయనలో అదే ఫైర్, ప్యాషన్ వున్నాయి. ఆయన నుండి కొత్త నటులు చాలా నేర్చుకోవాలి.

ఫరియా తో పని చేయడం ఎలా అనిపించింది ?
ఫరియాతో పని చేయడం మంచి అనుభవం. చాలా ఎనర్జిటిక్. తను ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా ఇది. ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. కథని నమ్మి చేసింది. ఇది చాలా గొప్ప విషయం. ఫరియా నుండి చాలా నేర్చుకున్నాను.

సుదర్శన్ గురించి ?
సుదర్శన్ టెర్రిఫిక్ యాక్టర్, తనతో ఎక్ మినీ కథ చేశాను కాబట్టి ఆల్రెడీ ఒక సింక్ వుంది. ఎక్ మినీ కథతో మా కెమిస్ట్రీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇందులో డబుల్ ట్రిపుల్ ఎంజాయ్ చేస్తారు.  

ప్రభాస్ గారు మీ ప్రతి సినిమాకి సపోర్ట్  చేస్తుంటారు.. కానీ మొన్న ఆయనతో డైరెక్టర్ యాక్సెస్ లేదని చెప్పారు ?

ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఎదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. లైక్ షేర్ & సబ్స్క్రైబ్ నేను గర్వపడి, నమ్మిన సినిమా. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించడం నా డ్రీమ్.

నేను సినిమా పరిశ్రమ కి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకూ నాకు ఎదురైన వారంతా నాన్న (దర్శకుడు శోభన్) గురించి ఒక మంచి మాట చెప్పారు. నవ్వుతూ పలకరించారు. ఇది నా అదృష్టం. నేను మరింత కష్టపడి చేస్తాను. నాన్న వెళ్ళిపోయి 14 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ నా చుట్టూ వున్నవాళ్ళంతా ఆయన గురించి చెబుతూ నవ్వుతూ పలకరిస్తున్నారంటే వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్టే.

ఎఎంబీ ప్రమోషనల్ వీడియో ఐడియా ఎవరిదీ ?
నిజానికి అక్కడికి వేరే వీడియో షూట్ చేయడానికి వెళ్లాం. అయితే అక్కడికి అక్కడ అనుకొని ఆ వీడియో చేశాం. ఆడియన్స్ నుండి చాలా ఇంట్రస్టింగ్ రియాక్షన్స్ వచ్చాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైయింది. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. నటుడు కావాలని కల కన్నాను. అయ్యాను. ఇప్పుడు మరింతగా కష్టపడి మంచి సినిమాలు చేయాలి.

కొత్త సినిమాల గురించి ?
డిసెంబర్ 21 నందిని రెడ్డి గారి సినిమా ‘అన్ని మంచి శకునములే’ వస్తోంది. అలాగే యువీ క్రియేషన్స్ లో ‘కళ్యాణం కమనీయం’ వుంది. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని వుంది. నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Telugu 70mm

Recent Posts

‘Gangs of Godavari’ Teaser.. Vishwak Sen Oora Mass Avatar..!

Vishwak Sen, who had a decent hit with 'Gaami', is now coming to the audience…

7 hours ago

Mahesh – Vijay Multistarrer Set This Time?

Tollywood superstar Mahesh Babu and Tamil actor Vijay have a good relationship. Mahesh Babu will…

7 hours ago

జూన్ 27న ‘కల్కి‘.. కొత్త పోస్టర్ తో క్లారిటీ

రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఎ.డి' సినిమా కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానే…

9 hours ago

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ టీజర్.. విశ్వక్ సేన్ ఊర మాస్ అవతార్..!

‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రంతో ప్రేక్షకుల…

9 hours ago

కృష్ణ పుట్టినరోజున సుధీర్ బాబు ‘హరోం హర‘

సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఇప్పటివరకూ సుధీర్ బాబు చేయనటువంటి వైవిధ్యభరిత పాత్రతో ఈ సినిమా రాబోతుంది.…

10 hours ago

‘రామం రాఘవం‘ టీజర్.. కొత్త పంథాలో తండ్రీకొడుకుల అనుబంధం

కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం 'రామం రాఘవం'. తండ్రీకొడుకుల…

10 hours ago