కృతిశెట్టి నటన కూడా నేర్పించడయ్యా

ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా నటన రాకపోయినా ఆడియన్స్ పట్టించుకోలేదు. వారికి నటించే అవకాశం ఉన్న పాత్రలు కూడా తక్కువే కాబట్టి అలా పాసైపోయారు. కానీఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ నటననూ విశ్లేషిస్తున్నారు.. విమర్శస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఒక్కో సినిమాతో నటిగా అప్డేట్ కావాల్సి ఉంటుంది. బట్.. ఈ హీరోయిన్ మాత్రం ఆ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదు. యస్.. ఫస్ట్ మూవీ బిగ్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ పట్టేస్తోంది. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినా.. నటన మాత్రం ఇంకా ఒకటో నంబర్ దగ్గరే ఉంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరా అంటారా..? కృతిశెట్టి.. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కుర్రాళ్ల హార్ట్స్ ను బ్రేక్ చేసిన బ్యూటీ. బేబమ్మగా యంగ్ స్టర్స్ అంతా తెగ పిలుచుకున్నారు.

ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడంతో ఈ టీనేజ్ బ్యూటీకి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. యాక్టింగ్ స్కిల్స్ ఏ మాత్రం లేకపోయినా.. తన చార్మ్ వల్ల నానితో శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్యతో బంగార్రాజు, రామ్ సరసన ద వారియర్ సినిమాల్లో నటించింది. బట్ ఈ రెండ సినిమాల్లోనూ తన నటన ఏ మాత్రం మెరుగవలేదు. నిజానికి ఈ మూడు సినిమాల్లోనూ మూడు భిన్నమైన పాత్రలు. ఏ మాత్రం ప్రయత్నించినా.. మంచి నటిగానూ గుర్తింపు వచ్చి ఉండేది. బట్ బేబమ్మ ఆ ప్రయత్నాలు చేసినట్టు అస్సలు కనిపించలేదు.

ఇక లేటెస్ట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోనూ అదే సింగిల్ ఎక్స్ ప్రెషన్. ఆ ఎక్స్ ప్రెషన్ తోనే సినిమా అంతా కనిపించింది. దీంతో చూసినవాళ్లంతా మరీ ఇంత డల్ గా ఉంటే ఎలా అనుకుంటున్నారు. నిజానికి కృతి నటనపై మొదటి నుంచీ విమర్శలున్నాయి. తొలినాళ్లలో ఇవి కామనే. కానీ ఆఫర్స్ పెరుగుతున్నప్పుడు ఆ విమర్శకులను తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలి కానీ.. ఇలా అదే ఎక్స్ ప్రెషన్స్ ను అన్ని సినిమాల్లో లాగించేస్తానంటే ఎలా అంటున్నారు. ప్రస్తుతం తను నటించి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. అలాగే మళ్లీ నాగ చైతన్యతోనే వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సూర్య సరసన బాలా డైరెక్షన్ లో సినిమా చేస్తోంది. మరి బాలా సినిమా తర్వాత అయినా బేబమ్మ బేల నటన మెరుగవుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts