కొరమీను’ మోషన్ పోస్టర్‌ను విడుదల

జాలరిపేట నేపధ్యంలో సాగే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘కొరమీను’ .ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆనంద్ రవి హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర,
గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటీ నటులుగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు.ఈ “కోరమీను” మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదల చేశారు.

మోషన్ పోస్టర్ చూస్తుంటే ఆకాశంలో విపరీతమైన మబ్బులతో మేఘమృతంమై ఉరుములు మెరుపుల మధ్య జాలర్లు పట్టే కొన్ని వందల బొట్స్ కనిపించగా అందులోని ఒక బోట్ పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’ అంటూ పోస్టర్‌లోని BGM, సెట్టింగ్ మరియు పోస్టర్ చూస్తుంటే ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తుంది. అక్కడే ఒక యువకుడు సీరియస్ గా ఎంతో తీక్షణమైన లుక్‌తో చూసే విధానం చూస్తుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ఈ సందర్బంగా దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ..మా చిత్ర మోషన్ పోస్టర్ ను లావణ్య త్రిపాటి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథ విషయానికి వస్తే జాలారిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో సాగే కథ ఇది. .సరదా-ప్రేమగల డ్రైవర్, అతని యజమాని అయిన అహంకారి ధనవంతుడు మరియు వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు ఇలా మూడు ముఖ్యమైన పాత్రలతో మంచి కంటెంట్ తో వస్తున్న “కొరమీను” అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

Telugu 70mm

Recent Posts

Mrunal’s stylish ramp walk

Mrunal Thakur, who started her rise from the silver screen, is shining as a heroine…

3 mins ago

There is no clarity on Pooja’s new projects

Pooja Hegde became a star heroine in Tollywood within a short period. However.. the opportunities…

14 mins ago

‘Indian 2, and Game changer’ within a gap of three months

Shankar is one of South India's most talented directors. In his career span of 30…

21 mins ago

‘వార్ 2’ కోసం యాక్షన్ లో ఇరగదీస్తున్న ఎన్టీఆర్

బాలీవుడ్ లో యశ్ రాజ్ స్పై యూనివర్శ్ నుంచి వచ్చే సినిమాలకు సెపరేట్ క్రేజుంది. ఈ యూనివర్శ్ లోని సినిమాలు…

34 mins ago

దిల్‌రాజు నిర్మాణంలో ధనుష్ సినిమా

మాతృభాష తమిళంలో మాత్రమే కాకుండా.. పరభాషల్లోనూ దూకుడు పెంచుతున్నాడు ధనుష్. ముఖ్యంగా ఈ మధ్య తెలుగులో బిజీ అవుతున్నాడు. 'సార్'…

50 mins ago