ఖిలాడీ దర్శకుడు.. కామెడీ సినిమా

ఒకటీ రెండు హిట్స్ పడే వరకూ ఏ దర్శకుడైనా స్ట్రగుల్ అవుతాడు. ఆ తర్వాత అంతా సాఫీగా ఉంటుంది అనుకుంటే పొరబాటే. ఇండస్ట్రీలో ఉండాలంటే నిరంతరం సక్సెస్ లోనే ఉండాలి. లేకపోతే సింపుల్ గా పక్కనబెట్టేస్తారు.అప్పుడెప్పుడో 2005లో తరుణ్ హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడు ఒక ఊరిలో అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు రమేష్‌ వర్మ.

తర్వాత రైడ్ అనే చిత్రంతో మెప్పించాడు. బట్ ఎప్పుడూ హిట్ అనిపించుకోలేదు. అయినా రవితేజ నమ్మాడు. నాటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాక్షన్ అనే పదమే లేదు కానీ.. దాదాపు ఆ తరహా కంటెంట్ తోనే వీర అనే సినిమా చేశాడు. ఇది ఊర ఫ్లాప్ అయింది. అటుపై చాలా గ్యాప్ తీసుకుని నాగ శౌర్యతో అబ్బాయితో అమ్మాయి అన్నాడు. అదీ పోయింది.

ఫైనల్ గా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన రాచ్చసన్ ను తెలుగులో మక్కీకి మక్కీ దించేసి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తే అది ఇక్కడా బ్లాక్ బస్టర్ అయింది. ఇంకేం ఈ ట్యాగ్ తో మళ్లీ మాస్ రాజాను అప్రోచ్ అయ్యాడు. రవితేజ కూడా ఇతను హిట్ ట్రాక్ ఎక్కడాని డేట్స్ ఇచ్చాడు. మంచి అంచనాల మధ్య వచ్చిన ఖిలాడీ సినిమా పోయింది. దీంతో మరోసారి క్రాస్ రోడ్స్ లోకి వచ్చాడు రమేష్‌వర్మ.


అయితే ఖిలాడీ పోయినా.. అతని టేకింగ్ చాలామందికి నచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ హీరోగా ఓ కథ సిద్ధం చేసుకుని వినిపించాడు. లారెన్స్ కూడా ఓకే చెప్పాడు. అయితే ఈ చిత్రం పట్టాలెక్కడానికి టైమ్ పడుతుంది. ఆ టైమ్ కోసం ఎదురుచూస్తోన్న రమేష్‌ వర్మకు అనుకోకుండా ఓ హారర్ కామెడీని రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది.


2022లో బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భూల్ భులయ్యా 2ను తెలుగులో రీమేక్ చేయమని ఓ పెద్ద ప్రొడ్యూసర్ అతని వద్దకు వచ్చాడట. లారెన్స్ సినిమాకు టైమ్ ఉంది కాబట్టి దీనికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా కథలోమార్పులు జరుగుతున్నాయి. అలాగే హీరోల కోసం కూడా వేట సాగుతోంది.

హిందీలో ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీజంటగా నటించారు. టబు, రాజ్ పాల్ యాదవ్, అమర్ ఉపాధ్యాయ్ కీలక పాత్రలు చేశారు. ప్రస్తుతం వినిపించేదాన్ని బట్టి తెలుగు వెర్షన్ కోసం నాగ చైతన్య, కళ్యాణ్‌ రామ్, వరుణ్‌ తేజ్ లాంటి వారిని పరిశీలిస్తున్నారట. మరి ఈ రీమేక్ కు ఈ హీరోలు ఓకే చెబుతారా లేదా అనేది అప్పుడే చెప్పలేం.

Telugu 70mm

Recent Posts

మే 10న విడుదలకు ముస్తాబవుతోన్న ‘సత్య‘

సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…

16 hours ago

‘కన్నప్ప‘లో అక్షయ్ కుమార్ పోర్షన్ కంప్లీట్

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు ఈ…

16 hours ago

‘బాక్‘ సినిమా రివ్యూ

నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…

16 hours ago

ఆ… ఒక్కటీ అడక్కు‘ సినిమా రివ్యూ

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…

17 hours ago

‘ప్రసన్నవదనం‘ రివ్యూ

నటీనటులు: సుహాస్‌, పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష, నితిన్‌ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్‌.చంద్రశేఖరన్‌సంగీతం:…

17 hours ago

Mahesh-Rajamouli film’s Muhurtham fix?

The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…

20 hours ago