ఫిబ్రవరి 23న జయం రవి ‘సైరన్’

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడయ్యాడు. లేటెస్ట్ గా ‘సైరన్’ మూవీతో తెలుగులో అలరించడానికి రాబోతున్నాడు. ఫిబ్రవరి 23న విడుదలకు ముస్తాబైన ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఓ ఖైదీ పాత్రలో కనిపించబోతున్నాడు జయం రవి. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు.

Related Posts